ఇక ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ రింగ్‌!

31 Aug, 2021 03:58 IST|Sakshi

భారీ పెట్టుబడులకు ప్రణాళికలు

రిలయన్స్‌ జియో తరహాలోనే..

న్యూఢిల్లీ: బూమింగ్‌లో ఉన్న దేశీ మొబైల్‌ టెలికం రంగంపై ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ కన్నేసింది. గతేడాది రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన గూగుల్‌ భారతీ ఎయిర్‌టెల్‌పైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎయిర్‌టెల్‌లోనూ భారీగా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎయిర్‌టెల్‌తో జరుపుతున్న చర్చలు చివరి దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

వెరసి ఎయిర్‌టెల్‌లోనూ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలు చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశీయంగా పోటీ సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ రెండింటిలోనూ గూగుల్‌ వాటాలు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.73 శాతం వాటాను గూగుల్‌ కైవసం చేసుకుంది. ఇందుకు రూ. 33,737 కోట్లు వెచ్చించింది.  గూగుల్‌తో డీల్‌ కుదిరితే ఎయిర్‌టెల్‌కు నిధుల రీత్యా బూస్ట్‌ లభిస్తుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు