Google Maps: గూగుల్‌ అదిరిపోయే ఫీచర్‌, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..!

19 Nov, 2021 19:10 IST|Sakshi

షాపింగ్‌ చేయడానికో లేదంటే ఇతరాత్ర పనుల మీద బయటకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు కరోనానే కారణం. మహమ్మారి వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. మాట్లాడాలన్నా, ఫ్రీ గా తిరగాలన్నా సాధ్యం కావడం లేదు. రద్దీగా ఉండే ప్రాంతాలవైపు వెళ్లడమే మానేశాం. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ 'గూగుల్‌ మ్యాప్స్‌'లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని గుర్తిస్తుంది.   

హాలిడేస్‌లో సరదగా కుటుంబ సభ్యులకు బయటకు వెళ్లేందుకు, లేదంటే షాపింగ్‌ చేసేలా గూగుల్‌ మ్యాప్స్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం గూగుల్‌  సంబంధిత ప్రాంతాలకు చెందిన వ్యాపార వివరాలు, డైరెక్టరీస్‌ (సంస్థల వివరాలు )ను సేకరించింది. వాటి సాయంతో లోకేషన్‌లో ఉన్న వ్యక్తుల కదలికలు, ఏ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉందో గుర్తించేందుకు సహాయపడనుంది.   

వరల్డ్‌ వైడ్‌గా 
గూగుల్‌ ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకోసం వరల్డ్‌ వైడ్‌గా అందుబాటులోకి తీసుకొనిరానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, మాల్స్, బస్సు, రైల్వేస్టేషన్‌లతో పాటు, భవనాల రహదారులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ జోడించబడిన తర్వాత, వినియోగదారులు ఒకే చోట అందుబాటులో ఉన్న అన్ని షాపులు, రెస్టారెంట్‌లు, విమానాశ్రయ లాంజ్‌లు, కార్‌ రెంటల్‌, పార్కింగ్ స్థలాల్ని ఈజీగా గుర్తించవచ‍్చని గూగుల్‌ ప్రకటనలో వెల్లడించింది.

చదవండి : గూగుల్‌ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్‌లో చెలరేగిపోవచ్చు

మరిన్ని వార్తలు