గూగుల్‌​ మ్యాప్స్‌ కొత్త ఆప్‌డేట్‌.. !

14 Mar, 2021 15:02 IST|Sakshi

మీకు గుర్తుందా..! బహుశా మీరందరూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసే ఉంటారు.. సినిమాలో సుబ్బు (నాని) దూద్‌కాశికి వెళ్లడానికి నాకు ట్రావెల్‌ గైడ్‌ ఏం అవసరం లేదు​ అని చెప్పి , నాకు గూగుల్‌ మ్యాప్స్‌ ఉంది అది చూస్తూ నేను  దూద్‌కాశికి వెళ్లిపోతానని అంటాడు చివరికి  గూగుల్‌ మ్యాప్స్‌ సుబ్బును ఎక్కడికో లోయలోకి తీసుకుపోతుంది.. ఈ సన్నివేశం చూసి మనం కడుపుబ్భా నవ్వుకున్నాం.. ఎందుకంటే మనలో కూడా చాలామందికి గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి అలాంటి పరిస్థితి ఏర్పడింది.

మనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్తుంది. అంతేకాకుండా సీదా వెళ్లాల్సిన మార్గాలను వదిలేసి మనల్ని గూగుల్‌ మ్యాప్స్‌ తిప్పుకుంటూ తీసుకెళ్తుంది. దీంతో మన సమయం , అటు పెట్రోల్‌ వృథా అవుతోంది. అసలే దేశంలో ముడిచమురు ధరలు కొండేకుతున్నాయి. కొన్ని సార్లు గూగుల్‌ మ్యాప్స్‌ను అసలు నమ్మకూడదని నిర్ణయించుకుంటాం. తప్పుగా చూపించిన మార్గాలను రిపోర్ట్‌ చేసిన అంతగా ఫలితం ఉండదు. కానీ భవిష‍్యత్తులో గూగుల్‌ మ్యాప్స్‌నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురుకావు. ఎందుకంటే తప్పుగా ఉన్న మార్గాలను గూగుల్‌ మ్యాప్స్‌లో మనమే ఎడిట్‌ చేయవచ్చును. అంతేకాకుండా మిస్సయిన రోడ్లను కూడా యాడ్‌ చేయొచ్చు.

కేవలం ఏడు రోజుల్లో యూజర్లు తెలిపిన విషయాన్ని  పరిశీలించి ఆ మార్గాలను  ఆప్‌డేట్‌ చేయనుంది.  ఈ విషయాన్ని గూగుల్‌ తన బ్లాగ్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ టూల్‌ను  గూగుల్‌టెస్ట్‌ చేస్తోంది. ఈ కొత్త ఆప్‌డేట్‌  రానున్న రోజుల్లో సుమారు 80 దేశాల్లో తీసుకురాబోతున్నారు. 

(చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...!)

మరిన్ని వార్తలు