WhatsApp: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..!

12 Oct, 2021 17:21 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్‌ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్‌చేసేందుకు గూగుల్‌ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్‌ స్టోరేజ్‌ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్‌ మరో ఎత్తుతో యూజర్లకు షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్‌..!

 
వాట్సాప్‌లో పరిమిత సేవలు...!
వాట్సాప్‌ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌.  సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్‌ సొంతం. వాట్సాప్‌లోని ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లను బ్యాకప్‌ చేసుకొనే సౌకర్యాన్ని యూజర్లకు వాట్సాప్‌ యాప్‌ కల్పిస్తోంది.  వాట్సాప్‌ యూజర్లకు బ్యాకప్‌ విషయంలో నియంత్రణను కల్పించేలా కొత్త బ్యాకప్‌ ఫీచర్‌పై వాట్సాప్‌ పనిచేస్తోంది. బ్యాకప్‌పై నియంత్రణ ఉంచడంతో యూజర్లకు నచ్చిన వాటిని బ్యాకప్‌ చేసుకొనే వీలు ఉంటుంది. వాట్సాప్‌ బ్యాకప్‌ డేటా పూర్తిగా యూజర్‌ సంబంధిత గూగుల్‌ డ్రైవ్‌లో సేవ్‌ అవుతుంటుంది. గూగుల్‌ డ్రైవ్‌లో అపరిమితంగా వాట్సాప్‌ డేటాను బ్యాకప్‌ చేసుకోవచ్చును. 

తాజాగా వాట్సాప్‌ నిర్ధిష్ట బ్యాకప్‌ డేటాకు మాత్రమే ఆలో చేయనున్నట్లు  తెలుస్తోంది. దీంతో అపరిమిత వాట్సాప్‌ బ్యాకప్‌ డేటాకు త్వరలోనే కాలం చెల్లనుంది. రానున్న రోజుల్లో వాట్సాప్‌ అపరిమిత బ్యాకప్‌ డేటా  వాడకం కోసం గూగుల్‌ ఛార్జ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు వాట్సాప్‌ బ్యాకప్‌ డేటా పై 2000ఎమ్‌బీ వరకు పరిమితిని గూగుల్‌ విధించనుంది. కాగా ప్రస్తుతం వస్తోన్న వార్తలపై వాట్సాప్‌, గూగుల్‌ స్పందించలేదు. వాట్సాప్‌ బ్యాకప్‌ డేటా పరిమితిపై  రానున్న రోజులే నిర్ణయించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.   
చదవండి: దేశీయ విమాన ప్రయాణీకులకు ఊరట

మరిన్ని వార్తలు