గూగుల్ మీట్ ఫ్రీ వీడియో కాల్స్ గడువు పొడిగింపు

1 Apr, 2021 16:27 IST|Sakshi

గూగుల్ మీట్ తన ఉచిత అన్‌లిమిటెడ్ వీడియో కాల్‌ల సేవలను(24 గంటలు) జూన్ 2021 వరకు పొడిగించింది. గూగుల్ మీట్ ద్వారా వీడియో కాల్స్ చేసే జి-మెయిల్ వినియోగదారులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఇంతకముందు వరకు గూగుల్ మీట్ వీడియో కాల్స్ ఉచిత సేవలు 2021 మార్చి 31 వరకు మాత్రమే జి-మెయిల్ వినియోగదారులకు లభించేవి. ఈ పొడిగింపును గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు. 2020 కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఉద్యోగులు, విద్యార్థులు ఆన్లైన్ వీడియో వినియోగం పెరగడంతో గూగుల్ మీట్ పేరుతో కొత్త సేవలను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ట్విట్టర్‌లోని అధికారిక గూగుల్ వర్క్‌స్పేస్ ఖాతా ద్వారా 'అన్‌లిమిటెడ్' గూగుల్ మీట్ కాల్‌ సేవలను పొడగిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది గూగుల్ హ్యాంగ్ అవుట్‌ను గూగుల్ మీట్‌గా రీ బ్రాండ్ చేసింది. కోవిడ్‌కు ముందు దీని ద్వారా 60 నిమిషాల వరకు వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఆ తరువాత లాక్‌డౌన్‌లో ఇంటి నుంచి పనిచేసేవారి సంఖ్య పెరగడంతో పరిమితిని పెంచింది. 24 గంటలూ వీడియో కాల్స్, మీటింగ్స్ నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. 100 మందిని మీటింగ్‌లో యాడ్ చేసే ఆప్షన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇంతకు మించి సబ్‌స్క్రైబర్స్‌ను మీటింగ్స్‌కు యాడ్ చేయాలంటే గూగుల్ వర్క్‌ స్పేస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

చదవండి:

స్పేస్‌ఎక్స్ కు ఇండియాలో ఎదురుదెబ్బ

>
మరిన్ని వార్తలు