ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లకు గూగుల్‌ శుభవార్త..!

21 Jun, 2021 17:25 IST|Sakshi

ఆపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్‌ మామూలుగా ఉండదు. సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే ఆపిల్‌ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్‌ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అంతేకాకుండా ఆపిల్‌ ఐఫోన్‌ ఒక వేళ పోయినా, దొంగలించిన, తిరిగి ఫోన్‌ను పొందగలిగే టెక్నాలజీ ఆపిల్‌ సొంతం.

ఐఫోన్లలోని టెక్నాలజీ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కూడా రానుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ‘ఫైండ్‌ మై డివైజ్‌’ పేరిట ఉన్నప్పటికీ ఈ సదుపాయాన్ని మరింత అదనంగా కొత్త ఫీచర్లను యాడ్‌ చేయాలని గూగుల్‌ భావిస్తోంది. ‘ఫైండ్‌ మై నెట్‌వర్క్‌’ పేరిట ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ తీసుకురానుంది. గూగుల్‌ ‘ఫైండ్‌ మై డివైజ్‌’తో మొబైల్‌ ఫోన్‌ను ట్రాక్‌ చేయవచ్చును. ఫైండ్‌ మై డివైజ్‌లో మెయిల్‌ ఐడీ, పాస్‌వర్ఢ్‌తో లాగిన్‌ అయితే మొబైల్‌ ఉన్న లోకేషన్‌ చూపిస్తోంది. ఇది కేవలం పోయిన మొబైల్‌కు నెట్‌వర్క్‌ కనెక్టివీటీ, ఇంటర్నెట్‌ ఆన్‌ , జీపీఎస్‌ కనెక‌్షన్‌ ఆన్‌లో ఉంటేనే మొబైల్‌ను ట్రాక్‌ చేయగలము.

కాగా ఆపిల్‌ తన ఐవోస్‌ 13లో భాగంగా ఫైండ్‌ మై డివైజ్‌కు అదనపు ఫీచర్లను జోడించి ఆపిల్‌ కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్లు, ఐపాడ్‌, ఆపిల్‌ తెచ్చిన ఎయిర్‌టాగ్స్‌తో గుర్తించవచ్చును. కాగా ప్రస్తుతం గూగుల్‌ ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా వర్షన్‌లో టెస్టింగ్‌ దశలో ఉంది. ఈ ఫీచర్‌ ఏవిధంగా పనిచేస్తోందని గూగూల్‌ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. ఈ ఫీచర్‌తో సుమారు 3 బిలియన్ల ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఆపిల్‌లో ఫైండ్‌ మై డివైజ్‌ ఎలా పనిచేస్తుంది..?
సాధారణంగా ఆపిల్‌ ఐఫోన్లలో ఫైండ్‌ మై డివైజ్‌ ఉన్న ఫీచర్‌లో ముందుగానే లాస్ట్‌ మై డివైజ్‌ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి. లాస్ట్‌ మై డివైజ్‌లో స్నేహితుల, లేదా ఇతర ఫోన్‌ నంబర్‌ను కచ్చితంగా ఎంటర్‌ చేయాలి. లాస్ట్‌ డివైజ్‌ సహకారంతో పోయినా మొబైల్‌ వేరేవారికి దొరికినా, లేదా దొంగిలించినా ఆ మొబైల్‌ స్విచ్చ్‌ ఆన్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌ లోకేషన్‌, మీరు ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ లోకేషన్‌ వస్తోంది. అంతేకాకుండా ఈ ఆప్షన్‌తో మొబైల్‌ ఫోన్‌ ఆన్‌ చేయగానే మన ఫోన్‌ నంబర్‌ కనిపించేలా ఓ మెసేజ్‌ను చూపిస్తోంది. దీన్ని ముందుగానే లాస్ట్‌ మై డివైజ్‌లో ఎంటర్‌ చేస్తేనే కనిపిస్తోంది.

చదవండి: ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్‌ సీఈవో..!

మరిన్ని వార్తలు