విద్యార్థినులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌!

24 Nov, 2021 18:39 IST|Sakshi

ప్రముఖ టెక్ దిగ్గజం "గూగుల్" విద్యార్థినులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. విద్యార్థినుల కోసం 'జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్' పేరుతో ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేయొచ్చు. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థినులు 2021 డిసెంబర్ 10లోగా స్కాలర్‌షిప్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. 

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారికి 2022-23 విద్యాసంవత్సరానికి 1000 డాలర్లు అంటే సుమారు రూ.74,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత సాంకేతిక రంగాలలో 2021-22 విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ డిగ్రీని చదువుతున్న ఫుల్ టైమ్ విద్యార్థినుల స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు రెండవ సంవత్సరం చదువుతూ మంచి మార్కులు కలిగి ఉండాలి. ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

గూగుల్ స్కాలర్‌షిప్ దరఖాస్తు విధానం

  • ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Scholarships+ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
  • జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ Asia Pacific ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
  • నియమ & నిబంధనలు చదివిన తర్వాత APPLY NOW పైన క్లిక్ చేయాలి.
  • తర్వాత గూగుల్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
  • పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత విద్యార్థినికి సంబంధించిన మరిన్ని వివరాలు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాతి సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
  • రెజ్యూమె, అకడమిక్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, ఎస్సే ప్రశ్నలకు సమాధానాలు అప్‌లోడ్ చేయాలి.

జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ఎంపిక విధానం
అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేయబడ్డ విద్యార్థినులను 15 నిమిషాల 'మీట్ అండ్ గ్రీట్' సెషన్ కోసం పిలుస్తారు. దీని తర్వాత గూగుల్ ఆన్ లైన్ ఛాలెంజ్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి 1,000 డాలర్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఏదైనా సందేహాలు ఉంటే గూగుల్ హెల్ప్ లైన్ మెయిల్కి మీ ప్రశ్నలు పంపవచ్చు.

మరిన్ని వార్తలు