గూగుల్‌ పే యూజర్లకు గుడ్‌ న్యూస్‌..!

30 Mar, 2022 17:23 IST|Sakshi

ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం గూగుల్‌ పే తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ను అందించింది. మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్‌ టూ పే’ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. 

పైన్‌ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం..!
యూపీఐ సేవల్లో భాగంగా 'ట్యాప్ టు పే' ఫీచర్‌ కోసం ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో గూగుల్‌ పే జతకట్టింది. దీంతో యూజర్లు తమ కార్డ్‌లను ఉపయోగించకుండా యూపీఐ ద్వారా సజావుగా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ కేవలం డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పైన్ ల్యాబ్స్ రూపొందించిన ఆండ్రాయిడ్ పీఓఎస్‌ టెర్మినల్‌ని ఉపయోగించి లావాదేవీలను గూగుల్‌ పే యూజర్లు చేయవచ్చును.  నీయర్‌ టూ ఫీల్డ్‌(ఎన్‌ఎఫ్‌సీ) పేమెంట్స్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉండే అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌, స్టార్‌బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారులకు అందుబాటులోకి వచ్చింది. 

ట్యాప్‌ టూ పే ఫీచర్‌తో యూపీఐ పేమెంట్స్‌ మరింత తక్కువ సమయంలో జరుగుతాయని గూగుల్‌ పే బిజినెస్‌ హెడ్‌ సశిత్‌ శివానందన్‌ అన్నారు. అంతేకాకుండా అవుట్‌లెట్లలో, క్యూ మేనేజ్‌మెంట్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. గూగుల్‌ పేతో భాగస్వామిగా పైన్‌ ల్యాబ్స్‌ ఉన్నందుకు సంతోషిస్తున్నామని పైన్‌ ల్యాబ్స్‌ బిజినెస్‌ చీఫ్‌ ఖుష్‌ మెహ్రా అన్నారు.  భారత్‌లో కాంటక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ను అందించేందుకు పైన్‌ ల్యాబ్స్‌ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 

చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్‌ కంపెనీ... గట్టి కౌంటర్‌ ఇచ్చిన మీషో..! 

మరిన్ని వార్తలు