'గూగుల్ పే' సౌండ్‌పాడ్ వచ్చేస్తోంది.. 

24 Feb, 2024 21:47 IST|Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో గూగుల్ సంస్థ గత ఏడాది కాలం నుంచి 'గూగుల్ పే' సౌండ్‌పాడ్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది ఎట్టకేలకు పూర్తి కావొస్తోంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. 

వ్యాపారులు చెక్అవుట్ సమయాన్ని తగ్గించడానికి గూగుల్ పే సెప్టెంబరు 2017లోనే భారత్‌లో ఆవిష్కరించింది. ఇది సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను జరుపుకోడానికి అనుమతిస్తుందని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ 'అంబరీష్ కెంఘే' ఫిబ్రవరి 22న ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.

గూగుల్ పే సౌండ్‌పాడ్ ఎలా పనిచేస్తుందంటే..

  • సౌండ్‌పాడ్ అనేది ఆడియో పరికరం, ఇది చెల్లింపు స్వీకరించబడినప్పుడు ఆడియో ద్వారా వెల్లడిస్తుంది. దీంతో వ్యాపారాలు ప్రత్యేకంగా అమౌంట్ వచ్చిందా? లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
  • డిజిటల్ చెల్లింపు చేసే కస్టమర్ తప్పకుండా.. వ్యాపారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అమౌంట్ పంపిన వెంటనే సౌండ్‌పాడ్ సౌండ్ చేస్తుంది.
  • ఇప్పటికే మనదేశంలో పేటీఎం, ఫోన్ పే వంటివి అందించే బాక్సులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పేటీఎం సంక్షోభంలో ఉన్న కారణంగా కస్టమర్లు గూగుల్ పే దిశగా అడుగులు వేస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు