‘గూగుల్‌ పే.. ఈ యాప్‌ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!

17 Nov, 2022 08:38 IST|Sakshi

భారత్‌లో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌గా గుర్తింపు సంపాదించుకున్న గూగుల్ పే (Google Pay) తాజాగా నెట్టింట భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యాప్‌ యూజర్లు ట్విట్టర్‌లో దీనిపై #GPayతో ట్విట్స్ చేస్తూ వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పనికిరాని యాప్‌ (Use less App) అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్‌ పే అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. ఎంతలా అంటే ఏకంగా ఈ ట్రోలింగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఈ యాప్‌ పనికి రాదు
అమెరికన్‌ టెక్ కంపెనీ గూగుల్ ఈ గూగుల్‌ పే యాప్‌ను 2017లో ప్రారంభించింది. మొదట్లో దీని పేరు తేజ్ యాప్. గూగుల్‌ పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఈ యాప్‌ ద్వారా చేసే ఆన్‌లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ ఇచ్చేది.  

మొబైల్ రీఛార్జ్, డీటీహెఛ్‌ రీఛార్జ్ , విద్యుత్ బిల్లులు ఇలా ఒక్కటేంటి ఆన్‌లైన్‌కి చెల్లింపు వెసలుబాటు ఉన్న ఈ యాప్‌ ద్వారా యూజర్లు చెల్లించేవాళ్లు. ఈ క్రమంలో కొందరికి మూడు అంకెల నగదు రాగా, ఎక్కువ మంది కస్టమర్లకు కనీసం నగదు అనేది రివార్డ్స్‌ రూపంలో వచ్చేవి. అయితే రాను రాను ఈ పరిస్థితి కాస్త పూర్తిగా మారింది. కంపెనీ అందులో మార్పులు చేస్తూ నగదు నుంచి డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది.

కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా వివిధ డీల్స్‌పై డిస్కౌంట్లను ఇస్తుంది. దీంతో ట్విటర్‌లో దీనిపై యూజర్లు ఫైర్‌ అవుతున్నారు. ఓ యూజర్ గూగుల్ పే ఇంతకుముందు ఆన్‌లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బును ఇచ్చేదని, కానీ ఇప్పుడు రివార్డ్‌లుగా డిస్కౌంట్లు ఆఫర్లంటూ కార్డులు ఇస్తోందని వాపోయాడు. పలువురు యూజర్లు ట్విటర్‌ వేదికగా మండిపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను  షేర్‌ చేస్తున్నారు.

చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు!

మరిన్ని వార్తలు