గూగుల్‌ పిక్సెల్‌ 6 సిరీస్‌: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే..

20 Oct, 2021 07:53 IST|Sakshi

All about The New Google Pixel 6 and Pixel 6 Pro Smart Phones: చాలాకాలంగా ప్రచారంలో వినిపిస్తున్న పిక్సెల్‌ 6 సిరీస్‌ను ఎట్టకేలకు గూగుల్‌ అధికారికంగా లాంఛ్‌ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన గూగుల్‌ ఈవెంట్‌లో..  పిక్సెల్‌ సిరీస్‌లో భాగంగా పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో మోడల్స్‌ ఫీచర్స్‌ను రివీల్‌ చేసింది. పిక్సెల్‌ సిరీస్‌లో గూగుల్‌ ఈ ఫోన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు కారణాలు.. సొంత టెన్సార్‌ చిప్‌సెట్‌లతో పాటు  ఆండ్రాయిడ్‌12 వెర్షన్‌తో తీసుకురావడం.


గూగుల్‌ పిక్సెల్‌ 6
6.4 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+అమోలెడ్‌ స్క్రీన్, 90 హెచ్‌జెడ్‌ డైనమిక్‌ రిఫ్రెష్‌ రేట్‌
పంచ్‌హోల్‌ కట్‌అవుట్‌, గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ 
టెన్సార్‌ చిప్‌సెట్‌తో 8జీబీ ర్యామ్‌ 128 జీబీ/256 జీబీ వేరియెంట్లలో లభ్యం.. యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజ్‌
4,614ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌


50ఎంపీ మెయిన్‌ కెమెరా, వైడర్‌ షాట్స్‌ కోసం 12ఎంపీ ultrawide lens
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
మ్యాజిక్‌ ఎరేస్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ ఫీచర్‌ కూడా


గూగుల్‌ పిక్సెల్‌ 6 ప్రో

6.7 ఇంచుల క్యూహెచ్‌డీ+ అమోలెడ్‌ స్క్రీన్, 120 హెచ్‌జెడ్‌ డైనమిక్‌ రిఫ్రెష్‌ రేట్‌

 కట్‌అవుట్‌, గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
టెన్సార్‌ చిప్‌సెట్‌తో 12జీబీ ర్యామ్‌ 128 జీబీ/256 జీబీ/512జీబీ.. యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజ్‌
 5,003 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌


50ఎంపీ మెయిన్‌ కెమెరా, వైడర్‌ షాట్స్‌ కోసం 12ఎంపీ ultrawide lens, 48ఎంపీ టెలిఫొటో లెన్స్‌ అదనం. 
11.1 ఎంపీ సెల్ఫీ కెమెరా
మ్యాజిక్‌ ఎరేస్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ ఫీచర్‌ కూడా

చిప్​మేకర్​ క్వాల్​కమ్ కంపెనీని కాదని.. సొంత టెన్సార్‌ చిప్‌తో గూగుల్‌ ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.  ఈ రెండింటి టెన్సార్‌షిప్‌ కూడా టైటాన్‌ ఎం2 చిప్‌ ద్వారా భద్రత కల్పించనుంది. స్టీరియో స్పీకర్‌, మూడు మైక్రోఫోన్స్‌, డ్యుయల్‌ సిమ్‌ సపోర్ట్‌, వైఫై 6ఈ సపోర్ట్‌, బ్లూటూత్‌ 5.2, సబ్‌ 6సీహెచ్‌ 5జీ.. సపోర్ట్‌తో ఈ ఫోన్లు వచ్చాయి. 

ధరలు ఎంతంటే.. 
పిక్సెల్‌ 6 ప్రారంభ ధర 599 డాలర్లు(దాదాపు మన కరెన్సీలో రూ.44, 971), పిక్సెల్‌ ప్రొ ధర 899 డాలర్లు(దాదాపు 67,494 రూపాయలు). అయితే ఈ సిరీస్‌ ఫోన్లు భారత్‌లో ఎప్పుడు లాంఛ్‌ అవుతాయనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఫోన్లతో పాటు పిక్సెల్‌ పాస్‌ ప్రోగ్రామ్‌ను సైతం అనౌన్స్‌ చేసింది. దీని ప్రకారం.. నెల నెల కొంత చెల్లించి ప్రీమియం గూగుల్‌ వన్‌ స్టోర్‌ 200 జీబీ, యూట్యూబ్‌ ప్రీమియం, యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్రీమియం, గూగుల్‌ ప్లే పాస్‌ పొందొచ్చు. యూఎస్‌లో ఈ ప్లాన్‌ల ధరను పిక్సెల్‌ మోడల్స్‌కు 45 డాలర్లుగా, పిక్సెల్‌ ప్రోకు 55 డాలర్లుగా నిర్ణయించారు.
 

చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఇదే..!

మరిన్ని వార్తలు