గూగుల్‌ పిక్సెల్‌ 7 సిరీస్‌లో క్వాలిటీ సమస్యా? అసలు ఏమైంది?

13 Jan, 2023 19:41 IST|Sakshi

సాక్షి, ముంబై: గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో హవా చాటుకున్న గూగుల్‌ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై మరోసారి  విమర్శలు వెల్లువెత్తాయి.  గత ఏడాది అక్టోబరులో లాంచ్‌  చేసిన గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌లో వీడియో కాల్‌ నాణ్యత బాగా లేదంటూ విమర్శలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. అద్భుతమైన ఇమేజింగ్ నాణ్యత, పిక్చర్ క్యాప్చరింగ్‌ ఫోన్లగా చెప్పుకుంటున్న ఈ ఫోన్లలో రియర్‌, సెల్పీ కెమెరాల వీడియో క్వాలిటీ పూర్‌, మసక మసకగా ఉంటోందని యూజర్లు  ఫిర్యాదు చేశారు.


(ఫోటో క్రెడిట్‌: ఆండ్రాయిడ్‌ పోలీస్‌)

Google Meetతో సహా పలు యాప్‌లలో వీడియో క్వాలిటీ అసలు బాలేదనీ, ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే వీడియో నాణ్యత చాలా తక్కువగా ఉన్నాయని  రెడిట్‌  యూజర్‌ ఒకరు ఫిర్యాదు చేశారు. అంతేకాదు  Pixel 7 నుండి  రిసీవ్‌ చేసుకున్న  వీడియోలు కూడా అస్పష్టంగా,మసక బారినట్లుగా ఉన్నాయని ఆరోపించారు.   పలువురు ట్విటర్ వినియోగదారులు కూడా దాదాపు ఇదే ఆరోపణ చేశారు. పిక్సెల్ 7 ప్రోతో Google Meetలో వీడియో కాల్ చేస్తున్నప్పుడు  నాసెల్పీ కెమెరా అసలు క్లియర్‌గా లేదు..దీనికేదైనా  పరిష్కారం ఉందా అని అని ఒకరు గత నెలలో ట్వీట్‌ చేశారు.


(ఫోటో క్రెడిట్‌: ఆండ్రాయిడ్‌ పోలీస్‌)

గూగుల్‌ సొంత యాప్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాం యాప్స్‌లో వీడియో కాల్స్‌ అస్పష్టంగా ఉన్నాయని పిక్సెల్ 7 ప్రో యూజర్‌  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, దీనిపై డజన్ల కొద్దీ ఇతర Android వినియోగదారులు వ్యాఖ్యానించినట్టు ఆండ్రాయిడ్‌ పోలీస్‌ నివేదించింది. గతంలో పిక్సెల్‌ 6లో ఇలాంటి సమస్యే వచ్చిందని నివేదించింది. సాఫ్ట్‌వేర్ సమస్య కావచ్చని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ద్వారా గూగుల్‌  దీన్ని పరిష్కరించాలని యూజర్లుకోరుతున్నారు. 

కాగా గతంలో  కూడా గూగుల్‌ పిక్సెల్‌ 7 యూజర్లు రియర్‌ కెమెరా గ్లాస్‌ పగిలిన ఫిర్యాదుల నేపథ్యంలో  రీప్లేస్‌ చేసింది.  మరి తాజా ఫిర్యాదులపై  ఎలా స్పందిస్తుందో చూడాలి.  గూగుల్‌ పిక్సెల్‌ 7 ధర రూ. 52,950, గూగుల్‌ పిక్సెల్‌ 7 ప్రొ ధర రూ. 84,999గా ఉంది. గూగుల్‌ పిక్సెల్ 7, 7 ప్రో అక్టోబర్ 2022లో భారతదేశంలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు