ఉద్యోగులకు గూగుల్‌ శుభవార్త..!

27 Jul, 2020 21:44 IST|Sakshi

బెంగుళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కానీ సాఫ్ట్‌వేర్‌ రంగం మాత్రం వర్క్‌ ఫ్రమ్ హోమ్‌(ఇంటి నుంచే ఉద్యోగం) ద్వారా కొంత మేర నిలదొక్కుకుంది. అయితే మహమ్మారి తగ్గడానికి ఎంత సమయం పడుతుందో ఎపరు చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సాఫ్టవేర్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇది వరకు తమ ఉద్యోగుల క్షేమం కోసం ఈ ఏడాది డిసెంబర్‌ వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌలభ్యాన్ని కల్పించింది. అయితే ఇంకా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌలభ్యాన్ని వచ్చే ఏడాది(2021, జూన్‌)సంవత్సరం వరకు పోడగించే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌లో 2లక్షల మంది రిగ్యూలర్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సేవలందిస్తున్నారు.  దేశంలో పనిచేస్తున్న గూగుల్‌ ఉద్యోగులకు ఈ వెసలుబాటు వర్తించనుంది. అయితే గూగుల్‌కు దేశంలో బెంగుళూరు, హైదరాబాద్‌లో మంచి మార్కెట్‌ ఉంది. ఇటీవల గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ దేశంలో 75,000కోట్ల డిజిటల్‌ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు