Google Play Store: 8 యాప్‌లను డిలీట్‌ చేసిన గూగుల్‌.. మీరు చేయకపోతే డేంజరే!

18 Jul, 2022 15:41 IST|Sakshi

ప్రస్తుత 4జీ కాలంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది. టెక్నాలజీ పుణ్యమా అని మనకు కావాల్సినవన్నీ మొబైల్‌లోనే ప్రత్యక్షమవుతన్నాయి. అయితే దీంతో పాటే కొన్ని సార్లు వైరస్‌, హాకర్ల రూపంలో ప్రమాదాలు వస్తుంటాయి. అందుకు మనం కాస్త జాగ్రత్త వహిస్తే వాటి నుంచి బయటపడచ్చు. ప్రస్తుతం మాగ్జిమమ్‌ ఇంగ్రావ్‌ అనే ఫ్రెంచ్‌ రీసెర్చర్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను హెచ్చరించారు. ప్రమాదకరమైన కొన్ని యాప్‌లను ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయని అవి మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్‌​ చేయాలని సూచించారు. లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదన్నారు.

అయితే ఇప్పటికే గూగుల్‌ ప్లేస్టోర్‌ వాటికి కనుగొని అందులో నుంచి తీసేసింది. అయినా కొందరు తెలియక వాటిని వేరొక సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకుని ఉపయోగిస్తూనే ఉన్నారు. కాగా ఈ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డిలీట్‌ చేసినప్పటికీ వీటి ఏపీకే (APK) వర్షన్స్‌ ఇంకా గూగుల్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని కొందరు దుండగులు ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫేక్‌ ప్రోఫైల్స్‌ క్రియేట్‌ చేశారు.  వాటి ద్వారా యాడ్స్‌ క్రియేట్‌ చేసి ప్రొమోట్‌ చేస్తున్నారు. ఆ యాడ్లను క్లిక్‌ చేసిన యూజర్ల డేటాను హ్యాకర్లు చేజిక్కించుకుంటున్నారు. దీంతో వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. కనుకు వెంటనే మీ మొబైల్‌లో ఈ యాప్‌లు ఉంటే డిలీట్‌ చేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రమాదకర 8 యాప్‌లు ఇవే..
1. వోల్గా స్టార్‌ వీడియో ఎడిటర్‌,
2. క్రియేటివ్‌ త్రిడీ లాంచర్‌,
3. ఫన్నీ కెమెరా,
4. వావ్‌ బ్యూటీ కెమెరా,
5. జీఐజీ ఈమోజీ కీబోర్డ్‌,
6. రేజర్‌ కీబోర్డ్‌ ఎండ్‌ థీమ్‌,
7. ఫ్రీగ్లో కెమెరా,
8. కోకో కెమెరా.

చదవండి: Suv Cars: రెండేళ్లైన వెయిట్‌ చేస్తాం.. ఎస్‌యూవీ కార్లకు క్రేజ్‌.. ఎందుకో తెలుసా!

మరిన్ని వార్తలు