గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం..! ఇకపై వాటికి చెల్లించాల్సిందే...!

14 Jul, 2021 20:42 IST|Sakshi

కరోనా రాకతో పూర్తిగా ఆన్‌లైన్‌ క్లాసులు, జూమ్‌ మీటింగ్‌లతోనే స్కూల్‌, కార్యాలయాల పనులు సాగుతున్నాయి.  తాజాగా గూగుల్‌ మీట్‌ యాప్‌ను వాడే యూజర్లకు గూగుల్‌ షాకివ్వనుంది. గూగుల్‌ మీట్‌లో ఇకపై అపరిమిత ఉచిత వీడియో కాలింగ్‌ ఫీచర్‌కు కాలం చెల్లనుంది. గూగుల్‌ తీసుకున్న  నిర్ణయంతో యూజర్లు  గ్రూప్ కాల్స్‌ను కేవలం ఒక గంటపాటు ఉచితంగా లభించనుంది.

తాజా అప్‌డేట్‌ ప్రకారం గూగుల్‌ మీట్‌లో కాల్‌ మాట్లేడేటప్పుడు 55 నిమిషాల తరువాత కాల్‌ ముగుస్తుందనే నోటిఫికేషన్‌ రానుంది. తరువాత కాల్‌ కొనసాగించాలంటే అప్‌గ్రేడ్‌ను కోరుతుంది. అప్‌గ్రేడ్‌ చేస్తే కాల్‌ కొనసాగుతుంది లేకపోతే కట్‌ అవుతుంది. గూగుల్‌ తాజాగా తీసుకొచ్చిన అప్‌డేట్‌తో ముగ్గురు కంటే ఎక్కువ మంది పాల్గొనే మీటింగ్స్‌లో  కేవలం గంట పాటు మాత్రమే సమావేశాలు కొనసాగుతాయి.

జూమ్ కూడా మీటింగ్స్‌పై పరిమితిని విధిస్తోంది. జూమ్‌ యాప్‌లో కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.  ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు పాల్గొనే మీటింగ్‌లకు కచ్చితంగా అప్‌గ్రేడ్‌ కావాల్సిందే. కరోనా మహమ్మారి సమయంలో సమయ పరిమితి లేకుండా 100 మంది వ్యక్తులతో ఉచిత సమావేశాలను రూపొందించడానికి గూగుల్మీట్‌ యాప్‌ను గూగుల్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు