'అభినవ ఘోరి మహమ్మద్‌',గూగుల్‌పై 39 సార్లు దండయాత్ర..చివరికి..

25 Jul, 2022 16:21 IST|Sakshi

చరిత్ర పూటాల్లోకి ఒక్కసారి తొంగి చూస్తే ఘోరి మహమ్మద్‌ల దండ్రయాత్ర గురించి చాలా సార్లు వినే ఉంటాం. కానీ మనం నేటి ఘోరి మహమ్మద్‌ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోరుకున్న దాన్ని దక్కించుకోవడం వారు చేస్తున్న దండ యాత్రల నుంచి ఎంతో కొంత ప్రేరణ పొందాల్సి ఉంది.  

టైలర్ కోహెన్..నెటిజన్లు ముద్దుగా అభినవ ఘోరి మహమ్మద్‌ అని పిలుస్తుంటారు. ఇక అసలు విషయాల్లోకి వెళితే.. ఉన్నత విద్యను అభ్యసించిన టైలర్‌ కోహెన్‌కు గూగుల్‌లో ఉద్యోగం చేయడం అంటే మహాపిచ్చి.ఎంతలా అంటే గూగుల్‌ తనని 39 సార్లు కాదన్న సరే..అందులోనే ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. 40వ సారి జాబ్‌ కొట్టాడు. కానీ గూగుల్‌లో కాదు. ఎందులో అంటే.  

ప్రస్తుత కాంపిటీషన్‌ వరల్డ్‌లో దిగ్గజ టెక్‌ కంపెనీల్లో కోరుకున్న జాబ్‌ పొందాలంటే అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుంది. జాబ్‌ కోసం కావాల్సిన కోచింగ్‌ తీసుకొని రెండు, మూడు సార్లు ట్రై చేస్తుంటారు. కావాల్సిన జాబ్‌ దొరక్కపోవడంతో..వచ్చిన జాబ్‌ చేసుకుంటూ జీవితంతో రాజీ పడలేక మనో వేధనకు గురవుతుంటారు. కానీ టైలర్ కోహెన్ అందరిలా కాదు. 

2019 నుంచి గూగుల్‌లో జాబ్‌ కోసం ట్రై చేస్తున్నాడు. గూగుల్‌ అతన్ని రిజెక్ట్‌ చేస్తూ వచ్చింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 39సార్లు గూగుల్‌లో జాబ్‌ కోసం ప‍్రయత్నించి సఫలమయ్యాడు. డూర్‌ డాష్‌ అనే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలో స్ట్రాటజీ హూప్స్‌ అసోసియేట్‌ మేనేజర్‌గా జాబ్‌ పొందాడు. ఆ జాబ్‌ను గూగూలే ఆఫర్‌ చేసింది. ఈ తరుణంలో తనని గూగుల్‌ 39సార్లు రిజెక్ట్‌ చేసిందంటూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ కాగా.. నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కావాల్సిన జాబ్‌ దొరకలేని కృంగి పోకుండా నీలా ట్రై చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు