Android 12: రిలీజ్‌కు ముందే అక్కడ.. గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లతో షురూ

5 Oct, 2021 13:53 IST|Sakshi

Android 12 update: ఆండ్రాయిడ్‌ 12 అప్‌డేట్‌పై గూగుల్‌ కంపెనీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నవంబర్‌ రెండో వారంలోపు లేటెస్ట్‌ వెర్షన్‌ను యూజర్ల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈలోపే ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌(లేటెస్ట్‌)కు సంబంధించిన కోడ్‌ను ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్ట్‌లో అప్‌లోడ్‌ చేసింది. 

మరికొన్ని వారాల్లో రాబోతున్న గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లతో లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ను అందించబోతోంది గూగుల్‌. ఆ తర్వాత శామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, ఒప్పో, రియల్‌మీ, టెన్కో, వివో, షియోమీ డివైజ్‌లకు ఇవ్వనుంది. పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్‌ సంబంధిత ఫోన్లకు 12-వెర్షన్‌ ఈ ఏడాది చివరిలోపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే  ఆండ్రాయిడ్‌ 12 బేటా వెర్షన్‌ ద్వారా(పిక్సెల్‌ డివైస్‌లతోనే) ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న గూగుల్‌.. ఆండ్రాయిడ్‌ 12 సోర్స్‌ను ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టు(AOSP)లో ఉంచేసింది.


చదవండి: ఇంటర్నెట్‌తో ఇక చాలా కష్టం!

ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో పాటు ప్రైవసీ డ్యాష్‌బోర్డ్‌, డైనమిక్‌ బిల్ట్‌ లాక్‌ స్క్రీన్, డైనమిక్‌ స్క్రీన్ లైటింగ్‌తో పాటు కెమెరా ఎఫెక్ట్స్‌, ఫొటోల ఎడిటింగ్‌ ఎఫెక్ట్ అనుభవాల్ని అందించబోతోంది నయా వెర్షన్‌. ఇక ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబర్‌ 27-28 తేదీల్లో జరగబోయే ఆండ్రాయిడ్‌ డేవ్‌ సమ్మిట్‌లో తెలియజేయనున్నారు. 2010 నుంచి ఆండ్రాయిడ్‌లో ఒక్కో వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తూ వస్తున్న గూగుల్‌.. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్‌ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐఫోన్లలో ఐవోఎస్‌ 15 వెర్షన్‌లు నడుస్తోంది.

గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్నారా..! ఐతే బీ కేర్‌ఫుల్‌...! 

ఈ 26 యాప్స్‌ ఇవి చాలా డేంజర్.. చెక్‌ చేస్కోండి!

మరిన్ని వార్తలు