గూగుల్‌ హెచ్చరికలు, ఈ 16 యాప్స్‌ చాలా డేంజర్​..వెంటనే డిలీట్‌ చేసుకోండి!

22 Oct, 2022 16:13 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ వినియోగదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ప్రమాదకరమైన 16 యాప్స్‌ను తొలగించినట్లు తెలిపింది. ఆ యాప్స్‌ను యూజర్లు వినియోగిస్తున్నట్లైతే వెంటనే వాటిని డిలీట్‌ చేయాలని కోరింది

బ్యాటరీని నాశనం చేయడం, డేటా వినియోగం ఎక్కువ అయ్యేలా చేసే 16 యాప్స్‌ ప్లేస్టోర్‌లో ఉన్నట్లు గూగుల్‌ గుర్తించింది. ఇప్పటికే 20 మిలియన్ల మంది ఇన్‌స్టాల్‌ చేసుకున్న సదరు యాప్స్‌ యూజర‍్లు ఉపయోగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. తమ యాప్స్‌ ఓ భద్రతా సంస్థ నుంచి గుర్తింపు పొందినవని చెబుతూ తప్పుడు ప్రకటనలతో యూజర్లను ఏమార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు గూగుల్‌ పేర్కొంది.        

ఆర్స్ టెక్నికా నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుండి 16 అప్లికేషన్‌లను తొలగించింది. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గుర్తించిన ఈ ప్రమాదకరమైన యాప్స్‌ను గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయడానికి, మొబైల్‌, లేదంటే టాబ్లెట్‌లలో ఫ్లాష్‌ను టార్చ్‌గా ఆన్ చేయడానికి లేదా వివిధ రకలా అవసరాల కోసం వినియోగించేందుకు ఉపయోగపడినట్లు తెలిపింది.  ఇప్పుడు అవే యాప్స్‌ యూజర్లకు నష్టం కలిగిస్తున్నట్లు మెకాఫీ ప్రతినిధులు తెలిపారు. 

తొలగించిన యాప్స్‌ 
తొలగించిన యాప్స్‌లలో BusanBus, Joycode, Currency Converter, High speed Camera, Smart Task Manager, Flashlight+, K-Dictionary, Quick Note, EzDica, ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ డౌన్‌లోడర్, ఈజెడ్‌ నోట్స్ వంటివి ఉన్నాయి.

చదవండి👉 భారత్‌లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు