మీ ఫోన్‌లో ఈ పాపులర్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

14 Oct, 2021 15:04 IST|Sakshi

రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిద రకాలుగా యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు ఇప్పుడు మరోసారి పాపులర్ ఎడిటింగ్ యాప్స్ రూపంలో నెటిజన్లను టార్గెట్ చేశారు. ఇటీవల గూగుల్ ప్రమాదకరమైన 150 యాప్స్‌‌పై నిషేదం విధించిన తర్వాత తాజాగా మరో మూడు యాప్స్‌ను నిషేదించినట్లు తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిషేదించిన ఈ మూడు యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, డబ్బును దొంగలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. భద్రతా సంస్థ కాస్పర్ స్కై ఈ ప్రమాధకరమైన యాప్స్‌ను గుర్తించింది. 

వినియోగదారుల సమాచారంతో తస్కరించేందుకు ఫేస్‌బుక్ లాగిన్ వివరాలు ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అనేక వెబ్ సేవలు, యాప్స్ 'లాగిన్ విత్ ఫేస్‌బుక్' అనే బటన్ ద్వారా వినియోగదారులను త్వరగా ధృవీకరించడానికి వారికి అనుమతిస్తాయి. అయితే, భద్రతా సంస్థ ప్రకారం.. ఈ యాప్స్ లాగిన్ డీటైల్స్ దొంగిలించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి సైన్-ఇన్ డేటాను ఉపయోగిస్తున్నాయి.(చదవండి: అలా చేస్తే పెను ముప్పే..! తీవ్రంగా హెచ్చరించిన ఆపిల్‌..!)

గూగుల్ నిషేదిత యాప్స్ జాబితా
గూగుల్ నిషేధించిన యాప్స్ పేర్లు "మ్యాజిక్ ఫోటో ల్యాబ్ - ఫోటో ఎడిటర్", "బ్లెండర్ ఫోటో ఎడిటర్-ఈజీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఎడిటర్", "పిక్స్ ఫోటో మోషన్ ఎడిట్ 2021". ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి నిషేదించారు.

వీటి నుంచి సురక్షితంగా ఉండటం ఎలా..
మొదట మీరు మీ మొబైల్ వీటిని వెంటనే డిలీట్ చేయండి. ఆ తర్వాత మీ ఫేస్‌బుక్ లాగిన్ వివరాలను వెంటనే మార్చుకోండి. చాలా మంది ఫోటో ఎడిటింగ్ యాప్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఇలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు సాధ్యమైనంత వరకు క్రెడెన్షియల్స్ వెరిఫై చేయండి. ఆన్‌లైన్‌లో ఒకసారి వీటి గురుంచి నెగెటివ్ వార్తలు ఉన్నాయో లేదో చూడండి.(చదవండి: ‘బిట్​కాయిన్​ ఓ చెత్త.. పనికిమాలిన వ్యవహారం’)

మరిన్ని వార్తలు