ప్లే స్టోర్ నుంచి మరో ఐదు యాప్స్ తొలగింపు

24 Nov, 2020 10:15 IST|Sakshi

న్యూ ఢిల్లీ: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి మరో ఐదు యాప్స్‌ను తొలగించింది.  వినియోగదారులకు స్వల్ప కాలిక రుణాలు అందించే ఐదు యాప్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ వినియోగదారులకు ఎక్కువ వడ్డీరేట్లకు స్వల్పకాలిక రుణాలను అందించడంతో పాటు తిరిగి చెల్లించడానికి రుణగ్రహీతలను వేధించాయి. తమ గూగుల్ ప్లేస్టోర్ డెవలపర్ విధానాలు వినియోగదారులను కాపాడటానికి, వారిని సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడినవని గూగుల్ ఈ సందర్భంగా ప్రకటించింది. (చదవండి: చైనా కంపెనీపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు

"ప్రజలకు త్వరగా నగదు అవసరమైనప్పుడు అందించడానికి లాక్డౌన్ సమయంలో ఇటువంటి గుర్తింపు లేని యాప్స్ పెరిగాయి. ఈ యాప్స్ పేర్లు కూడా గుర్తింపు గల కంపెనీల పేర్లతో పోలి ఉండటం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో ప్రజలకు తెలియదు. వీటిని కనీసం 4,00,000 నుండి 1 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేశారు" అని ఫిన్‌టెక్ పరిశోధకుడు ఎల్. శ్రీకాంత్  చెప్పారు, కనీసం ఇలాంటి 10 యాప్‌లను  తను అధ్యయనం చేసినట్లు తెలిపారు. టెక్నాలజీ గూగుల్ యొక్క ప్లే స్టోర్ నుండి తొలిగించిన వాటిలో ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఈకాష్, స్నాప్ ఇట్‌ లోన్‌ యాప్స్ ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యక్తిగత రుణాల నిబంధనల నుంచి ప్రజలను కాపాడటం కోసం తమ ఆర్థిక సర్వీసుల విధానాలను విస్తరించినట్లు పేర్కొంది. ఈ యాప్స్ ఫీచర్లు కూడా మనదేశ చట్టాల పరిధిలోకి రావు. కాబట్టి ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు