ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త..! సరికొత్త ప్రణాళికతో గూగుల్..అదే జరిగితే..!

20 Feb, 2022 13:31 IST|Sakshi

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ త్వరలోనే శుభవార్తను అందించనుంది. యూజర్ల ప్రైవసీ విషయంలో భారీ మార్పులను తెచ్చేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ తరహాలో భద్రత కలగనుంది.


యాపిల్ బాటలో...
యాపిల్ బాటలోనే గూగుల్  నడవనుంది.  ఐఫోన్లకు అందించే యూజర్ ప్రైవసీను ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్లకు తెచ్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఐఫోన్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని యాపిల్ తీసుకొచ్చింది. దీని సహాయంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ను ట్రాక్ చేయకుండా చేసే ఫీచర్ను యాపిల్ అందిస్తోంది. ఇదే ఫీచర్ ను గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు తెచ్చే పనిలో పడింది.


ప్రైవసీ సాండ్ బాక్స్..!
థర్డ్ పార్టీ యాప్ యూజర్ల డేటాను షేర్ చేసే విషయంలో గూగుల్ కొత్తగా ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ ను తీసుకురానుంది. ప్రైవసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్‌ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోనీ చవెజ్ ఓ బ్లాగ్‌లో అభిప్రాయాలను వెల్లడించారు. ప్రైవేట్ అడ్వర్టయిజింగ్ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని మేం ప్రకటిస్తున్నమని చెప్పారు. థర్డ్ పార్టీలతో డేటాను షేర్ చేయడాన్ని తగ్గిస్తామని చెప్పారు. కాగా ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే ఈ పాలసీల్లో ఈ మార్పులను తీసుకొచ్చేందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని, దీన్ని అమలు చేసేందుకు భాగస్వాములతో కలిసి గూగుల్ పని చేస్తుందని ఆంథోని వెల్లడించారు. మరో వైపు ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల్లో ట్రాకింగ్‌ను కట్టడి చేస్తే చాలా సంస్థలకు ఇబ్బందిగా మారే అవకాశము ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు