ఆండ్రాయిడ్ యూజర్స్‌కి శుభవార్త

21 Nov, 2020 12:15 IST|Sakshi

గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి శుభవార్త తెలిపింది. గూగుల్ తన రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్‌సిఎస్) ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌లోని మెసేజెస్ యాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉందని తెలిపింది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్‌ను గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌లో పాత తరం ఎస్సెమ్మెస్‌ స్థానంలో తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్ తన మెసేజెస్ యాప్‌లో ఆర్‌సిఎస్ స్టాండర్డ్ తీసుకురావడం కోసం కొంతకాలంగా అభివృద్ధి చేస్తుంది. ఆర్‌సిఎస్ ద్వారా వినియోగదారులు మెరుగైన కమ్యూనికేషన్ అనుభూతిని పొందుతారని తెలిపింది. దీని ద్వారా గ్రూప్‌ ఛాట్‌తో పాటు, ఎమోజీలు, ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ తరహాలోనే ఇందులో కూడా ఆన్‌లైన్ స్టేటస్‌, టైపింగ్, రీడ్ ఇండికేటర్స్‌ ఉంటాయి. (చదవండి: వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్)

దీనిలో వాట్సాప్లో లాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది. దాని వల్ల ఇతరులెవరు మెసేజ్‌లను చదవలేరు. కేవలం మీరు, మీతో మాట్లాడే వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు. ప్రస్తుతం పరీక్షలో దశలో ఉన్న ఈ ఫీచర్‌ను 2021 ప్రథమార్ధంలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. కొన్నేళ్లుగా కొత్త ఫీచర్స్‌ లేకపోవడంతో ఎక్కువ మంది యూజర్స్‌ మెసేజింగ్‌ కోసం వాట్సాప్‌తో పాటు ఇతర యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. వాటికి దీటుగా ఈ ఆర్‌సీఎస్‌ సేవలను గూగుల్ తీసుకొచ్చింది. (చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు