‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్‌ ఫీట్‌తో గూగుల్‌ సెర్చ్‌లో జూమ్‌

15 Mar, 2023 16:05 IST|Sakshi

సాక్షి,ముంబై: 95వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తాచాటిన సెన్సేషనల్‌ సాంగ్‌  నాటు నాటు హవా ఒక రేంజ్‌లో కొనసాగుతోంది.  ఆస్కార్‌  గెల్చుకున్న ఇండియన్‌ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసిన తర్వాత గూగుల్‌లో నెటిజన్లు తెగ వెతికేశారట. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ లోని ఈ సూపర్-హిట్ సాంగ్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌  గెల్చుకున్న తరువాత  దీనిపై నెటిజన్ల  ఆసక్తి 10 రెట్లకు పైగా పెరిగింది.  ఫలితంగా  నాటు నాటు సూపర్‌  ట్రెండింగ్‌లో నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా  దీనిపై సెర్చెస్‌ 1,105 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం వెల్లడించింది. 

జపనీస్ ఆన్‌లైన్ క్యాసినో గైడ్ 6తకరకుజీ, గూగుల్ సెర్చ్ ట్రెండ్ డేటాను విశ్లేషించింది. ఇందులో తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొన్ని గంటల  వ్యవధిలోనే  నాటునాటు కోసం ఆన్‌లైన్‌లో భారీ క్రేజ్‌ వచ్చిందనీ, సగటు కంటే 10 రెట్లు శోధనలు పెరిగాయని  వెల్లడించింది.

టాలీవుడ్‌ హీరోలు, జూ.ఎన్టీఆర్‌, మెగా హీరో రాంచరణ్‌  పెర్‌ఫామెన్స్‌ హైలైట్‌గా నిలిచింది.  నాటు నాటు ఒక హై-టెంపో రిథమ్, డ్యాన్స్‌ , స్టెప్పులు  గ్లోబల్‌గా విపరీతంగా ఆకట్టుకున్నాయి.  పాపులర్‌ సింగర్స్‌ లేడీ గాగా , రిహన్న వంటి సంగీత దిగ్గజాల మనసు కూడా దోచుకుందీ పాట. అంతేనా ఈ సాంగ్‌  టిక్‌టాక్‌లో ప్రముఖ సంచలనంగా మారింది, గత సంవత్సరం మార్చిలో విడుదలైనప్పటి నుండి 52.6 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌మూవీకిసముచిత గౌరవం లభించిందనీ, అవార్డుతో చరిత్ర సృష్టించిదంటూ 6టకరకుజీ ప్రతినిధి ప్రశంసించారు.

కాగా 95వ అకాడమీ ఆస్కార్ వేడుకలో, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఉర్రూత లూగిపోయారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నాటు నాటు ప్రదర్శనకు  అపురూపమైన స్టాండింగ్‌ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు