హమ్మయ్యా.. డాక్టర్లు ప్రిస్కిప్షన్‌లో ఏం రాశారో ఇట్టే తెలుసుకోవచ్చు!

19 Dec, 2022 20:27 IST|Sakshi

మీరెప్పుడైనా డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్‌ (మందుల చీటి) తీక్షణంగా చూశారా? చూస్తే మీకేమైనా అర్థం అయిందా? అర్థం కాదు. ఎందుకంటే డాక్టర్లు రాసిన మందుల చీటీపై ఉన్న రాత గీతల మాదిగానూ, ఏదో వేరే బాషలా ఉంటుంది. అది కేవలం డాక్టర్లకు, మందుల షాపుల్లోని ఫార్మాసిస్టులకు మాత్రమే అర్థమవుతుంది. అయితే  ఆ సమస్యను పరిష్కరించేలా గూగుల్‌ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 

గూగుల్‌ భారత్‌లో ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా -2022’ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను డిజిటలైజ్ చేయడం, మల్టీ సెర్చ్‌ ఫంక్షనాలిటీ అంటే యూజర్లు ఫోటోలు, స్క్రీన్‌షాట్‌లను తీసుకోవడంతో పాటు వారికి తలెత్తిన అనుమానాల్ని ప్రశ్నల్ని సంధించడం కోసం టెక్ట్స్‌ను జోడించేందుకు అనుమతి ఇస్తుంది. 

సెర్చ్ ఇన్ వీడియో
ఫోన్‌లలో సెర్చ్ యాప్ ద్వారా వీడియోలకోసం సెర్చ్‌ చేసేలా 'సెర్చ్ ఇన్ వీడియో' ఫీచర్‌ను  ఈవెంట్‌లో గూగుల్ ప్రదర్శించింది. అదే సమయంలో, ఆండ్రాయిడ్‌లోని ఫైల్స్ బై గూగుల్ యాప్ ద్వారా డిజిలాకర్ డాక్యుమెంట్‌లను సురక్షితంగా యాక్సెస్ చేయడానికి సపోర్ట్‌ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది.  

ప్రిస్క్రిప్షన్‌తో గూగుల్‌ ఏం చేస్తోంది?
గూగుల్‌ సంస్థ చేతితో వ్రాసిన ప్రిస్క్రిప్షన్‌లను చదవగలిగే ఏఐ,మెషిన్ లెర్నింగ్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లు చదవడం చాలా కష్టం. అందుకే డాక్టర్లు చేతితో వ్రాసిన ప్రిస్క్రిప్షన్‌ డిజిటలైజ్ చేయనున్నట్లు పేర్కొంది. అంటే డాక్టర్లు చేతితో రాసిన ప్రిస్క్రిప్షన్‌ను యూజర్లు గూగుల్‌లో అప్‌లోడ్‌ చేసి.. ఆ మందుల చీటీల్లో డాక్టర్‌ ఏం రాశారు? ఏ మందులు రాశారా? ఏ కారణం వల్ల అనారోగ్య సమస్య తలెత్తిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ టెక్నాలజీ వినియోగ వచ్చిన అందించిన ఫలితాల ఆధారంగా ఫీచర్‌ను పరిచయం చేస్తామని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని కంపెనీ తెలిపింది. కాగా, ఆ ఫీచర్‌ను ప్రస్తుతం డెవలప్‌ చేస్తున్నట్లు చెప్పింది. 

స్థానిక భాషల్లో సమాచారం
గూగుల్‌లో సెర్చ్‌ చేసే సౌకర్యాన్ని స్థానిక భాషల్లో సైతం అందుబాటులోకి తేనుంది. ముఖ్యంగా గూగుల్‌లో వాయిస్‌ ద్వారా ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఇంగ్లీష్‌, హిందీ వచ్చి ఉండాలి. కానీ ఇకపై స్థానిక భాష తెలుగు, తమిళం,కన్నడ వాయిస్‌లతో కావాల్సిన సమాచారం పొందవచ్చు.

మల్టీ సెర్చ్‌ 
మల్టీ సెర్చ్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ సాయంతో మీకు ఏదైనా ప్రొడక్ట్‌ సమాచారం కావాలంటే సులభంగా తెలుసుకోవచ్చు. మీరు స్నేహితులు, లేదంటే చుట్టాలింటికి వెళ్లినప్పుడు అక్కడ మీకు నచ్చిన కర్టెన్లు , కార్పెట్లు, లేదంటే డ్రస్‌లు ఉంటే వాటిని ఫోటోలు తీసి గూగుల్‌లో సెర్చ్‌ చేయొచ్చు. 

ఉదాహరణకు..డ్రస్‌ ఫోటో తీసుకొని ‘గూగుల్‌ లెన్స్‌’ అనే ఫీచర్‌లో ఆ ఫోటోను అప్‌లోడ్‌ చేయాలి. పక్కనే డ్రస్‌ అని సెర్చ్‌ చేస్తే.. ఆ కలర్‌ డ్రస్‌తో ఉన్న దుస్తులు, అవి అమ్మే ఈకామర్స్‌ సైట్ల జాబితా మొత్తం కనిపిస్తుంది.    

మరిన్ని వార్తలు