Russia Ukraine War: గూగుల్‌ హైడ్రామా! రష్యాకు మరో కోలుకోలేని దెబ్బ!

13 Mar, 2022 15:05 IST|Sakshi

ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో రష్యాకు ధీటుగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. దిగ్గజ టెక్‌ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే టెక్‌ దిగ్గజం గూగుల్‌ గూగుల్‌.. యూట్యూబ్ ప‌రిధిలోని ర‌ష్య‌న్ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  

గూగుల్‌ టెక్నికల్‌ అంశాలను సాకుగా చూపించి రష్యాలో గూగూల్‌ ప్లే స్టోర్, యూట్యూబ్ పేమెంట్స్ ఆధారిత అన్ని సేవలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో రష్యన్లు గూగుల్‌ ఆధారిత పెయిడ్‌ సబ్‌ స్క్రిప్షన్‌లను కొనుగోలు చేయలేరు. షాపింగ్‌ చేయలేరు. గూగుల్‌ కాకుండా వేరే సెర్చ్‌ ఇంజిన్‌లు రష్యాలో సేవలు కొనసాగిస్తున్నాయి. కానీ గూగుల్‌ మించిన సర్వీసులు లేకపోవడం గూగుల్‌ నిర్ణయం  ఆదేశ ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తుంది. 

ఇప్పటికే టెక్‌ కంపెనీలు 
రష్యా - ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా రష్యాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, శాంసంగ్‌ వంటి దిగ్గజ కంపెనీలు తమ సేవల్ని నిలిపివేశాయి. ఆర్దిక సంస్థలైన పేపాల్‌,వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లు సర్వీసుల‍్ని ఆపేశాయి. తద్వరా రష్యాకు ఆర్ధిక సంక్షోభం తలెత్తనుందని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఫ్లీజ్‌ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్‌!

మరిన్ని వార్తలు