ఈ యాప్ తో వేలల్లో సంపాదించండి

24 Nov, 2020 15:18 IST|Sakshi

టెక్ దిగ్గజం గూగుల్ నుండి మరో కొత్త యాప్ రాబోతుంది. ప్రస్తుతం బీటా పరీక్షా దశలో ఉన్న ఈ "గూగుల్ టాస్క్స్ మేట్" యాప్ తో చిన్న చిన్న తేలికైన పనులు చేయడం ద్వారా వేల రూపాయలు సంపాదించ‌వ‌చ్చు. ఈ యాప్ లో రెస్టారెంట్ యొక్క చిత్రాన్ని క్లిక్ చేయడం, వ్యక్తిగత ప్రాధాన్యతల గురించి సర్వేలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదా వాక్యాలను ఇంగ్లీష్ నుండి ఇతర భాషలకు అనువదించడం వంటివి ఉన్నాయి. బీటా టెస్టింగ్ ద‌శ‌లో కొంద‌రు ఎంపిక చేసిన టెస్ట‌ర్ల‌కు మాత్రమే రెఫ‌ర‌ల్ కోడ్ వ్య‌వ‌స్థ ద్వారా యాప్ లో ప్రవేశించడానికి అనుమతి వ‌స్తుంది. వినియోగదారులు వారు పూర్తి చేసిన పనులకు స్థానిక కరెన్సీలో డబ్బులు చెల్లిచబడుతాయి. ఈ గూగుల్ స‌ర్వీస్ ఇప్పుడు ఇండియాలోనూ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు ఓ రెడిట్ యూజ‌ర్ పోస్ట్ చేశాడు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, మీకు రిఫెరల్ కోడ్ ఉంటే తప్ప దాన్ని ఉపయోగించలేరు. (చదవండి: వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!)

ఎలా ప‌ని చేస్తుంది?
ఇందులో ద‌గ్గ‌రలోని పనులను గుర్తించి, వాటిని పూర్తి చేయడం ద్వారా డబ్బు సంపాందించే అవకాశం ఉంటుంది. ఇందులోని పనులను సిట్టింగ్ లేదా ఫీల్డ్ టాస్క్‌లుగా విభజించారు. ఉదాహరణకు, ఫీల్డ్ టాస్క్‌లో భాగంగా మీరు మీ సమీపంలోని రెస్టారెంట్ యొక్క ఫోటో తీసి, ఆ రెస్టారెంట్ కి సంబందించి మీ ప్రాధాన్యతల గురించి అడిగే సర్వే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా సంపాదించవచ్చు. దీని ద్వారా త‌న మ్యాపింగ్ వివ‌రాల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి గూగుల్ ప్ర‌య‌త్నిస్తోంది. అలాగే సిట్టింగ్ అంటే ట్రాన్స్‌స్క్రైబింగ్‌, ఇంగ్లిష్ నుంచి మీ భాష‌లోకి అనువ‌దించ‌డం లాంటి ప‌నులు చేయడం ద్వారా సంపాదించవచ్చు. ఏదైనా పనుల చేసి సంపాదించిన డబ్బును ఇ-వాలెట్‌కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం లేదా ఇన్‌-యాప్ పేమెంట్ పార్ట్‌న‌ర్ ద్వారా చెల్లిస్తుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా