Google Warns Chrome Users Of A Huge Security Threat: మనలో చాలా మంది ఎప్పుడు ఎదో ఒక విషయాన్ని తెలసుకునేందుకు బ్రౌజ్ చేస్తూనే ఉంటాం. బ్రౌజ్ చేసేందుకు గాను మనలో చాలా మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌పైనే ఆధారపడి ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా 2.65 బిలియన్ యూజర్లు గూగుల్ క్రోమ్ సొంతం. విస్తృత స్థాయిలో యూజర్ బేస్ ఉన్న క్రోమ్ బ్రౌజర్‌కు తరుచుగా సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. వెంటనే క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు గూగుల్ తెలిపింది. గూగుల్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో లైనక్స్, మాక్ఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ క్రోమ్ బ్రౌజర్లో నెలకొన్న సమస్యలను గూగుల్ వెల్లడించింది. జీరో డే హ్యాక్ పేరిట పలు క్రోమ్ యూజర్లపై సైబర్ దాడులు జరుగుతున్నట్లు గూగుల్ పేర్కొంది.
గూగుల్ క్రోమ్‌పై సైబర్ దాడులు జరుగుతున్నట్లు గూగుల్ ఉద్యోగులు గుర్తించారు. హై-రిస్క్ హ్యక్ నుంచి యూజర్లను రక్షించడం కోసం వెంటనే క్రొమ్ అప్డేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. తాజాగా గూగుల్ తెచ్చిన కొత్త అప్డేట్తో మరింత సెక్యూర్డ్ బ్రౌజింగ్ అనుభూతిని పొందవచ్చును.
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సురక్షితంగా ఉందో లేదో ఇలా చూడండి..