Google : ‘మీరు కోరిన సమాచారం మారుతోంది’

27 Jun, 2021 12:59 IST|Sakshi

సెర్చింజన్‌లో సరికొత్త నోటిఫికేషన్‌

సమాచార కచ్చితత్వంపై గూగుల్‌ ఫోకస్‌  

ఇప్పుడంతా డిజిటల్‌ యుగం. ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌ని అడిగేస్తున్నాం. క్షణాల్లో మనం అడిగిన దానికి సంబంధించిన సమాచారం గూగుల్‌ మన ముందు ఉంచుతోంది. అయితే గూగుల్‌ అందించే సమాచారంలో కచ్చితత్వం ఎంత అనే ప్రశ్న పదే పదే తలెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చిన్నట్టు తన బ్లాగ్‌లో గూగుల్‌ పేర్కొంది. 

నోటిఫికేషన్‌
సాధారణంగా గతంలో జరిగిన విషయాలకు సంబంధించి గూగుల్‌లో సమాచారం అప్‌ టూ డేట్‌గానే ఉంటోంది. అయితే బ్రేకింగ్‌ న్యూస్‌, అప్పటికప్పుడు జరిగే సమాచారం విషయంలో కచ్చితత్వం లోపిస్తోంది. గూగూల్‌లో సెర్చ్‌ చేసే సమయానికి జరుగుతున్న సంఘటల్లో క్షణక్షణానికి మార్పులు వస్తుంటాయి. వివిధ రకాల సోర్సుల ద్వారా ఇవన్నీ ఎప్పటిప్పుడు గూగుల్‌లో అప్‌డేట్‌ అవుతుంటాయి. ఇలా వెంటవెంటనే అప్‌డేట్‌ అవుతున్న సమాచారానికి సంబంధించి అలెర్ట్‌ ఇవ్వనుంది గూగుల్‌.

మారుతోంది
ఏదైనా ‍ బ్రేకింగ్‌ న్యూస్‌కి సంబంధించిన సమాచారం గూగుల్‌లో వెతికే క్రమంలో ‘ రిపోర్ట్స్‌ అబౌట్‌ ద టాపిక్‌ ఆర్‌ చేంజింగ్‌ ర్యాపిడ్లీ (results about the topic are changing rapidly) అంటూ గూగుల్‌ మనకు తెలియజేయనుంది. దీని వల్ల సమాచారం పొందడంలో కచ్చితత్వం వస్తుందని గూగుల్‌ చెబుతోంది. 
 

చదవండి : Google Meet: నయా ఫీచర్లు, ఇక డౌట్లు అడగాలంటే..

మరిన్ని వార్తలు