వావ్ ఏం టెక్నాలజీ గురూ,ప్లే అవుతున్న టీవీని పాజ్ క్లిక్ చేసి చూడొచ్చు!

9 May, 2022 16:17 IST|Sakshi

ఎలాంటి కెమెరాలు మిమ్మల్ని క్యాప్చర్‌ చేయకుండా  బాడీ లాంగ్వేజ్‌ ఎలాంటిదో గుర్తిస్తే. 

టీవీలో టెలికాస్ట్‌ అవుతున్న సినిమాలో ఓ కామెడీ సిన్‌ టెలికాస్ట్‌ అయ్యే సమయంలో మనం అర్జెంట్‌ పని మీద బయటకు వెళ్తాం.తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో ప్లే అవుతున్న సినిమాను పాజ్‌ నొక్కి ..వెనక్కి వెళ్లి  మనకు కావాల్సిన కామెడీ, సాంగ్స్‌ను  వీక్షిస్తే.  

బ్యాడ్‌ మూడ్‌లో ఉన్న మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు.ఆ క్షణంలో మీ మైండ్‌ సెట్‌ను గుర్తించి..అందుకు అనుగుణంగా పర్సనల్‌ కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌లో మీ మనసుకు నచ్చిన సాంగ్స్‌ ప్లే అయితే ఎలా ఉంటుంది. ఎస్‌! మీరు ఊహించింది నిజమే. భవిష్యత్‌లో ప్రస్తుతం మనం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటోమెషిన్‌ టెక్నాలజీతో సాధ్యం కానున్నాయి. 

పైన మనం చెప్పుకున్న ఊహాతీతమైన టెక్నాలజీపై ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ పనిచేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్‌ ఎలాంటి కెమెరాల్ని ఊపగించకుండా యూజర్ల కదలికలు, వారి ప్రవర్తనను రికార్డ్ చేసి, విశ్లేషించే కొత్త టెక్నాలజీపై గూగుల్‌ పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే బదులుగా శరీర కదలికలను గుర్తించి మానసిక స్థితి అర్థం చేసుకునేందుకు రాడార్‌ను ఉపయోగిస్తుందని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

కాగా, గూగుల్‌ ఈ తరహ టెక్నాలజీపై గతంలో పనిచేసింది. 2015లో గూగుల్‌ సోలి అనే సెన్సార్‌ను ఆవిష్కరించింది. ఇది ఖచ్చితమైన సంజ్ఞలు, కదలికల్ని గుర్తించేలా రాడార్ ఆధారిత ఎలక్ట్రో మ్యాగ్నెట్‌  తరంగాలను ఉపయోగించింది. గూగుల్‌ తొలిసారి గూగుల్‌ పిక్సెల్‌4లో ఈ సెన్సార్‌ను ఉపయోగించింది. దీంతో  మోగుతున్న అలారంను సౌండ్‌ చేసి ఆపివేయడం, మ్యూజిక్‌ను పాజ్ చేసేందుకు ఉపయోగపడింది.

చదవండి👉దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్‌ అదిరిపోయే ఆఫర్‌!

>
మరిన్ని వార్తలు