Sergey Brin Divorce News: నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, గుడ్‌బై!

18 Jun, 2022 16:08 IST|Sakshi

వివాహా బంధం విచ్చినమైతే చివరకు తీసుకునేది విడాకులే. అయితే సెలబ్రిటీల విడాకుల వ్యవహరం ఎప్పుడూ చర్చనీయాంశమే. బ్లూంబర్గ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న వ్యక్తి విడాకులకు సిద్ధమయ్యాడు. దీంతో భరణం ఎంత చెల్లించవ్చు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనే అంశం చర్చకు వస్తోంది.

గూగుల్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్జెబ్రిన్‌ ఈ ఏడాది జనవరిలో విడాకులకు దరఖాస్తు చేశారు. తన భార్య నికోల్ షెనహాన్‌ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. తమిద్దరి మధ్య పరిష్కరించుకోలేనంతగా భేదాభిప్రాయాలు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ దంపతులకు రెండేళ​‍్ల కూతురు ఉండగా.. కోర్టును జాయింట్‌ కస్టడికి ఇవ్వాలని కోరారు.

సెర్జెబ్రిన్‌, నికోల్‌ షనహాన్‌లు 2015 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. చివరకు 2018 నవంబరులో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే కాపురం నాలుగేళ్లకు మించి పటిష్టంగా ఉండలేక పోయింది. ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో వ్యవహరాం విడాకులకు దారి తీసింది. న్యాయవాదిగా పని చేసిన నికోల్‌ షెనహాన్‌ ఎంట్రప్యూనర్‌గానూ పలు ప్రాజెక్టులు చేపట్టారు.

బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం సెర్జెబ్రిన్‌ ఆస్తుల విలువ 96 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో భరణంగా సెర్జెకు భారీ మొత్తం దక్కవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఈ దంపతులు భారీగా ఉమ్మడి ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని సైతం చెరి సమానంగా పంచాల్సి ఉంటుంది. అయితే కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఆస్తుల పంపకం వివరాలు ఇంకా బహిర్గం కాలేదు.

ఇటీవల కాలంలో జెఫ్‌బేజోస్‌ - మెకెంజీ స్కాట్‌, బిల్‌గేట్స్‌ - మిలిందా , ఎలాన్‌మస్క్ - రైలీ దంపతుల విడాకులు కాస్ట్‌లీ వ్యవహారంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుటు వాటి జాబితాలో సెర్జెబ్రిన్‌ - నికోల్‌ షెనహాన్‌ చేరవచ్చని అమెరికన్‌ మీడియా అంచనా వేస్తోంది. 

చదవండి: మీ పర్‌ఫార్మెన్స్‌ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు!

మరిన్ని వార్తలు