కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!

1 Dec, 2021 16:18 IST|Sakshi

స్టాక్ మార్కెట్‌లో అందరినీ అదృష్టం ఊరికే వరించదు! వారు తీసుకునే రిస్క్ బట్టి అంతే స్థాయిలో రిటర్న్ వస్తుంది. ఒక్కోసారి వారి జాతకాలు కూడా ఏడాది కాలంలోనే మారిపోతాయి. కొన్ని నెలల కాలంలోనే లక్షాధికారిని కోట్లాధిపతిని చేయగల సత్తా ఒక్క షేర్ మార్కెట్‌కే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. గడిచిన 8 నెలల్లోనే కొన్ని చిన్న కంపెనీల షేర్లు రూ.1 లక్ష పెట్టుబడికి ఏకంగా రూ.80 లక్షల లాభం ఆర్జించి పెట్టాయి. బంగారు బాతులా మారిన గోపాల పాలీప్లాస్ట్(gopala polyplast ltd) షేర్లలో 8 నెలల క్రితం పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల పంట పండినట్లయింది. 

రూ.9 కంటే తక్కువ విలువున్న ఈ షేర్ల ధరలు కంటిన్యూయస్ బుల్ రన్‌లో భారీగా పెరిగిపోయాయి. దాంతో పెట్టుబడిదార్లకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది. భారతీయ ఈక్విటీ మార్కెట్ కోవిడ్-19 కనిష్ట స్థాయిల నుంచి బాగా రికవరీ అయ్యింది. ఈ క్రమంలో రూ.9 కంటే తక్కువ ధర ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్స్.. పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలను తెచ్చి పెట్టాయి. బెంచ్‌మార్క్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ ఈ ఏడాది మార్చి 26న రూ.8.26లుగా ఉన్న షేర్ ధర నేడు రూ.671లుగా ఉంది. అంటే కేవలం 8 నెలల కాలంలోనే 8000 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చి 26న లక్ష రూపాయలు విలువ గల స్టాక్స్ కొంటె ఇప్పుడు దాని విలువ రూ.80 లక్షలకు పైగా మారేది. స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే భాగ పరిశోదన చేసి పెట్టుబడి పెడతారో వారికి మాత్రమే ఎక్కువ శాతం లాభాలు వస్తాయి. ఎలాంటి ఆలోచన లేకుండా ఒకే సరి భారీ మొత్తంలో పెట్టుబడి పెడితే నష్ట పోయే ప్రమాదం ఎక్కువ.

(చదవండి: దుమ్మురేపిన టాటా మోటార్స్‌..! కంపెనీకి కాసుల వర్షమే..!)

మరిన్ని వార్తలు