'నిధి' కంపెనీల పట్ల జాగ్రత్త, హెచ్చరించిన ప్రభుత్వం

25 Aug, 2021 09:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘నిధి’ కంపెనీలపట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది. నిబంధనలు పాటించడంలో కనీసం 348 కంపెనీలు విఫలమైనట్లు తెలియజేసింది. వెరసి పెట్టుబడులు చేపట్టేముందు కంపెనీ పూర్వాపరాలు పరిశీలించమంటూ ఇన్వెస్టర్లకు సూచించింది.

గత ఆరు నెలల్లో నిధి కంపెనీలపట్ల జాగ్రత్త వహించమంటూ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ రెండోసారి హెచ్చరించడం గమనార్హం! భారీ సంఖ్యలోని నిధి కంపెనీలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయడంలేదని ప్రభుత్వం వెల్లడించింది. కంపెనీల చట్టం 2013, నిధి నిబంధనలు 2014ను అమలు చేయడంలో వైఫల్యం పొందుతున్నట్లు వివరించింది.

నిధి కంపెనీలు బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థల పరిధిలోకి వస్తాయి. సెక్షన్‌ 406తోపాటు, సవరించిన నిధి నిబంధనల ప్రకారం ఎన్‌డీహెచ్‌–4 కోసం దరఖాస్తు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. 2021 ఆగస్ట్‌ 4వరకూ చూస్తే నిధి చట్టంకింద దరఖాస్తు చేసిన కంపెనీలలో 348వరకూ తగినస్థాయిలో నిబంధనలను అందుకోలేకపోయినట్లు వెల్లడించింది.

చదవండి : జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు