-

వాహనదారులకు కేంద్రం శుభవార్త

31 Dec, 2020 16:36 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జనవరి 1 నుండి ఫాస్ట్‌టాగ్ ను తప్పని సరిచేస్తూ తీసుకున్న నిబంధనలను మరోసారి సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్ట్‌టాగ్ ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఈ గడువు మొదట జనవరి 1, 2021 వరకు ఉండేది. తాజాగా ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించబడింది. అసలు గడువు ప్రకారం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 1 నుండి టోల్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుకు పూర్తిగా మారాలని నిర్ణయించారు.(చదవండి: అమెజాన్‌లో 'మెగా శాలరీ డేస్' సేల్

ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చేసిన లావాదేవీల వాటా 75-80 శాతం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్‌ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్‌ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫీబ్రవరి 15 నుండి 100 శాతం నగదు రహిత రుసుము వసూలు చేయాలనీ కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం ఇంకో వైపు సింగల్ లేన్ మినహా అన్ని దారులను ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా మార్చాలని చూస్తుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం వల్ల ఇటు ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది అని కేంద్రం పేర్కొంది.
 

మరిన్ని వార్తలు