ప్రైవేటీకరణకు ఎయిరిండియా అనుబంధ సంస్థలు!

19 Sep, 2022 21:48 IST|Sakshi

నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను కేంద్రం రూ.18వేల కోట్లకు టాటా గ్రూప్‌కు అమ్మిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

టాటా గ్రూప్‌కు విక్రయించడానికి ముందే ఎయిరిండియాకు ఎయిరిండియా ఎయిపోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిరియిండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, అలయన్స్‌ ఎయిర్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌, హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనుమబంధ సంస్థలున్నాయి. వాటిని ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో పెట్టుబడులు, ప్రబుత్వ ఆస్తుల నిర్వహణ చూసే దీపం..ఎయిరండియా అనుంబంధ సంస్థల్ని కొనుగులో చేసే పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతుంది.   

మరిన్ని వార్తలు