భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌తో రూ.10,000 కోట్లు!

25 Oct, 2021 04:36 IST|Sakshi

డిసెంబర్‌ నాటికి జారీ అవకాశం  

న్యూఢిల్లీ: కేంద్రం డిసెంబర్‌లోగా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ (ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ద్వారా రూ.10,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖలో ఒక సీనియర్‌ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పురోగతి ప్రణాళికలకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇదే జరిగితే భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ జారీ ఇది మూడవ విడత అవుతుంది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ అనేది ప్రభుత్వ రంగ సంస్థల సులభతర రుణాలకు సంబంధించి ఒక  పెట్టుబడి సాధనం.

  ఈటీఎఫ్‌ ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీల ’ఏఏఏ’ రేటెడ్‌ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. 2020 జూలైలో రెండవ విడత భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ జారీ జరిగింది. మూడురెట్లకుపైగా ఇది ఓవర్‌సబ్‌స్రై్కబ్‌ అయ్యింది. రూ.11,000 కోట్ల సమీకరణలు జరిగాయి. ఇక 2019 డిసెంబర్‌లో వచ్చిన తొలి ఆఫర్‌ ద్వారా రూ.12,400 కోట్ల సమీరణలు జరిగాయి. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు మొదటి విడతలో మూడు, పది సంవత్సరాల మెచ్యూరిటీ ఆప్షన్లు ఉండగా, రెండవ విడతకు ఐదు, 12 సంవత్సరాల ఆప్షన్స్‌ ఉన్నాయి. ఎడెల్‌వైస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఈ పథకం ఫండ్‌ మేనేజర్‌. 

మరిన్ని వార్తలు