కేంద్రం చర్యతో ప్రైవేటు పరం కానున్న మరో సంస్థ..!

20 Jun, 2021 18:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ దిశకు మరో అడుగు ముందుకు పడింది. చమురు, గ్యాస్‌ ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిగా 100 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించే ప్రతిపాదనలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా నోట్‌ను రూపొందించింది. ఈ ముసాయిదాను కేంద్ర కేబినెట్‌ ఆమోదిస్తే భారత రెండో అతిపెద్ద చమురు రంగ సంస్థ బీపీసీఎల్‌ను ప్రైవేటుపరం చేయడానికి దారులు సుగమం కానుంది. 

తాజా పరిణామం ప్రకారం .. అంతకుముందే బీపీసీఎల్‌ను ప్రైవేటుపరం చేసే దానిలో భాగంగా అస్సాంలోని నూమాలీగడ్‌ రిఫైనరీ నుంచి బీపీసీఎల్‌ వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదాతో  బీపీసీఎల్‌లోని 52.98 శాతం వాటాను పూర్తిగా ప్రైవేటుపరం కానుంది . బీపీసీఎల్‌ కంపెనీను సొంతం చేసుకొవడానికి ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ వేదాంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌డీలపై అభిప్రాయాలను సేకరించిన తరువాత కేంద్ర మంత్రి వర్గ అనుమతి కోరనుంది. ప్రస్తుతం, పెట్రోలియం శుద్ధిలో 49 శాతం ఎఫ్‌డిఐలకు మాత్రమే అనుమతి ఉంది.

చదవండి: ‘నుమాలీగఢ్‌’కు బీపీసీఎల్‌ గుడ్‌బై!

మరిన్ని వార్తలు