యథేచ్చగా వాడుకుంటున్న గూగుల్‌, ఫేస్‍బుక్‌.. ఇకపై లాభాల్లో వార్తా సంస్థలకు వాటా!

17 Jul, 2022 04:08 IST|Sakshi

న్యూఢిల్లీ: సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్, ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లలో వచ్చే వార్తాంశాలపై ఆ సంస్థల నుంచే ఫీజు వసూలు చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలను భారత ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రస్తుతం వార్తా సంస్థల్లో తయారయ్యే వార్తాంశాలను గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలు యథేచ్చగా వాడుకుంటూ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు.

తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆయా వార్తా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం తాజాగా.. వార్తాంశాల ద్వారా వచ్చే ఆదాయంలో వాటాను వార్తా సంస్థలకు అందజేసేందుకు, లేని పక్షంలో ఆయా కంపెనీల నుంచి జరిమానా వసూలు చేసేందుకు ఉద్దేశించిన నిబంధనలకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు