ఎన్‌ఎఫ్‌ఎల్‌లో వాటా విక్రయం

11 Feb, 2021 05:15 IST|Sakshi

20 శాతం వాటాకు ఓఎఫ్‌ఎస్‌

400 కోట్లు సమకూర్చుకునే చాన్స్‌

న్యూఢిల్లీ: ఎరువుల రంగ పీఎస్‌యూ సంస్థ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌)లో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా 20 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా ఓఎఫ్‌ఎస్‌ను నిర్వహించేందుకు మర్చంట్‌ బ్యాంకర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల సంస్థలు మార్చి 2లోగా బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక శాఖ(దీపమ్‌) తాజాగా పేర్కొంది. ఇందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 20 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 400 కోట్లు సమకూర్చుకునే వీలుంది.  

ఐపీఓకు ఇండియా పెస్టిసైడ్స్‌  
నిధుల సమీకరణకు మరో సంస్థ సిద్ధమైంది. ఆగ్రో కెమికల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్‌ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు కోసం సెబీకి బుధవారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను విడుదల చేయనుంది. అలాగే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ అగర్వాల్‌తో పాటు ఇతర ప్రమోటర్లు రూ.700 కోట్ల షేర్లను విక్రయించునున్నట్లు కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు