దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ!

24 Nov, 2021 12:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ నేడు జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనల రిజిస్ట్రేషలు నిలిపివేయడం లేదని, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ వాహనాలను కొనుగోలు చేయడానికి అమ్మకాలను ప్రోత్సాహిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, విమానయాన ఇంధనంలో 50 శాతం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున ఈవీల అమ్మకాలు పెరిగాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. 

"మేము ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను" అని గడ్కరీ అన్నారు. దేశంలో 250 పైగా స్టార్టప్‌‌‌‌లు ఎలక్ట్రిక్-వాహనాల అభివృద్ది కోసం పనిచేస్తున్నాయని, దీంతో ఈవీల తయారీ ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తు అని పేర్కొన్న ఆయన.. వచ్చే నెలలో ఒక హైడ్రోజన్‌ కారు కొనబోతున్నట్లు కూడా నితిన్ గడ్కరీ తెలిపారు. 2019లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి 2025 నాటికి ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల వాడకాన్ని నిషేదించే ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. 

(చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు హెచ్చరిక..!)

అయితే, ఆటో మొబైల్ కంపెనీలు ఈ ప్రతిపాదనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగంపై నిషేధం వల్ల గ్రీన్ ఎనర్జి వాహనాల అమ్మకాలు పెరగవని పేర్కొన్నాయి. 2030 నాటికి అనేక దేశాలు ఐసీఈ వాహనాలను నీషేదిస్తుండటంతో.. భారత్ మాత్రం ప్రస్తుతానికి ఆ వైపు ఆలోచనలు ఏవి చేయడం లేదని ఆయన తెలిపారు. అయితే, వివిధ ప్రోత్సాహకాలు, పథకాలను అందించడం ద్వారా ఆటోమొబైల్స్ అమ్మకాల్లో గ్రీన్ ఎనర్జి వాహనాల శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 విధానం కింద సబ్సిడీలను అందిస్తున్నప్పటికీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రయోజనాలను అందించడంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి.

(చదవండి: లక్కీఛాన్స్‌ ! ఫ్రీగా విమాన టిక్కెట్లు పొందే అవకాశం)

మరిన్ని వార్తలు