10ఎఫ్‌ దాఖలుకు మార్చి వరకు గడువు

15 Dec, 2022 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: నాన్‌ రెసిడెంట్‌ (భారత్‌లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్‌ పత్రాన్ని మాన్యువల్‌గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది.

తక్కువ టీడీఎస్‌ అమలు చేసేందుకు వీలుగా నాన్‌ రెసిడెంట్‌ పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో ఫామ్‌ 10ఎఫ్‌ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్‌ నంబర్లు లేని వారు ఫామ్‌ 10ఎఫ్‌ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్‌ పోర్టల్‌ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్‌10 ఎఫ్‌ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

మరిన్ని వార్తలు