Coal India: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పై ఫోకస్‌ చేయండి , సీఐఎల్‌కు కేంద్రం సూచన

6 Oct, 2021 07:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కాలుష్య రహిత విధానాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, చార్జింగ్‌ పాడ్‌లు వంటి వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్‌ ఇండియా (సీఐఎల్‌)కు కేంద్రం సూచించింది.

‘కోల్‌ ఇండియా తన వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరించాలి, కొత్త పరిశ్రమలైన ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాడ్‌లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు మొదలైన వాటిల్లో అవకాశాలు అన్వేషించాలి‘ అని 2021–22కి సంబంధించిన అజెండాలో బొగ్గు శాఖ పేర్కొంది.

భవిష్యత్తులో కర్బన ఉద్గారాలపై మరిన్ని ఆంక్షలు అనివార్యం కానున్న నేపథ్యంలో సోలార్‌ వేఫర్‌ తయారీ, సౌర విద్యుదుత్పత్తి, కోల్‌ బెడ్‌ మీథేన్‌ మొదలైన వాటిని పరిశీలించవచ్చని తెలిపింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో 80% పైగా వాటా కోల్‌ ఇండియాదే. 2023–24 నాటికి 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది.

చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి..

మరిన్ని వార్తలు