Coal Shortage: దేశంలో రోజురోజుకీ కరెంట్‌ కోతలు, కోల్‌ ఇండియాకు కేంద్రం కీలక ఆదేశాలు!

4 Jun, 2022 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న కాలంలో విద్యుత్‌ రంగ యుటిలిటీలకు అవసరమయ్యే బొగ్గును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉండవలసిందిగా ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

రానున్న 13 నెలల్లో 12 మిలియన్‌ టన్నుల(ఎంటీ) కోకింగ్‌ కోల్‌ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందంటూ సూచించింది. ఎంతమొత్తం బొగ్గు కాలవసిందీ వెల్లడించేందుకు రాష్ట్ర జెన్‌కోలు, స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు శనివారం మధ్యాహ్నంవరకూ గడువును కోరినట్లు తెలుస్తోంది.తద్వారా కోల్‌ ఇండియా దిగుమతులకు ఆర్డర్లను పెట్టే వీలుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 2015 తదుపరి మహారత్న కంపెనీ కోల్‌ ఇండియా తిరిగి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. 

కాగా..ఈ జులై నుంచి 2023 జులై మధ్య కాలంలో 12 ఎంటీ బొగ్గు దిగుమతులకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్‌ కోతలకు తెరలేచిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టే బాటలో ప్రభుత్వం బొగ్గు నిల్వలు సిద్ధం చేసేందుకు తగిన సన్నాహాలు చేపట్టినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.

మరిన్ని వార్తలు