అవేం నమ్మొద్దు.. క్రిప్టోపై ఆర్థిక మంత్రి క్లారిటీ

6 Dec, 2021 10:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలన్నీ ప్రచారమవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని ఆమె పేర్కొన్నారు. కేబినెట్‌ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. 
 

ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్‌ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ‘ఆర్బీఐ కరెన్సీ, డిజిటల్‌ కరెన్సీలకు ఆమోదం!, క్రిప్టో ఎస్సెట్‌’.. ఇలా రకరకాల కథనాలు కొన్ని మీడియా హౌజ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందించారు. వివిధ అవసరాలకు క్రిప్టో టెక్నాలజీని వినియోగించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం తప్ప దేశీయంగా ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలన్నింటిని నిషేధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయని మంత్రి సంకేతాలు అందించారు.

ఇదిలా ఉంటే బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీని.. అధికారిక కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేం చేయలేదంటూ ఇంతకు ముందు ఆర్థిక మంత్రి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్లోబల్‌ క్రిప్టో మార్కెట్‌: ఒమిక్రాన్‌తోనూ లాభాలు.. కానీ, భారత పరిణామాలతో ఢమాల్‌

మరిన్ని వార్తలు