ఆర్థిక వ్యవస్థకు ‘జీఎస్‌టీ’ ఆశా కిరణం

2 Oct, 2020 05:14 IST|Sakshi

సెప్టెంబర్‌ వసూళ్లలో 4 శాతం వృద్ధి 

రూ. 95,480 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతోందని సెప్టెంబర్‌ నెల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సూచిస్తున్నాయి. సమీక్షా నెలలో వసూళ్ల పరిమాణం 4 శాతం వృద్ధితో (2019 ఇదే నెలతో పోల్చి) రూ.95,480 కోట్లకు ఎగసింది. 2019 సెప్టెంబర్‌లో ఈ వసూళ్లు రూ.91,916 కోట్లు. ఇక ఆగస్టులో వసూలయిన జీఎస్‌టీ వసూళ్లకన్నా సెప్టె ంబర్‌ వసూళ్లు 10% అధికంకావడం  మరో విశేషం.  

వివిధ విభాగాలను చూస్తే...
► సెప్టెంబర్‌ 2020 జీఎస్‌టీ వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.17,741 కోట్లు.
► స్టేట్‌ జీఎస్‌టీ రూ.23,131 కోట్లు.  
► ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ. 47,484 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.22,442 కోట్లుసహా).  
► సెస్‌ రూ.7,124 కోట్లు  (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.788 కోట్లుసహా).

నెలల వారీగా చూస్తే
నెల    వసూళ్లు  
    (రూ. కోట్లలో)
ఏప్రిల్‌    రూ.32,172  
మే    రూ.62,151
జూన్‌     రూ.90,917
జూలై     రూ.87,422  
ఆగస్టు     రూ.86,449

మరిన్ని వార్తలు