స్టార్టప్‌లకు ఏఐఎఫ్‌ల దన్ను

28 Sep, 2022 06:24 IST|Sakshi

720 స్టార్టప్‌ల్లో రూ.11,206 కోట్ల పెట్టుబడులు

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 720 స్టార్టప్‌లలో రూ.11,206 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. స్టార్టప్‌ల కోసం ఉద్దేశించిన ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌).. స్టార్టప్‌లలలోనే పెట్టుబడులు పెట్టే 88 ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌)కు రూ.7,385 కోట్లు సమకూర్చనున్నట్టు తెలిపింది.

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ బలోపేతానికి కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ మద్దతుతో ఏఐఎఫ్‌లు రూ.48,000 కోట్ల పెట్టుబడులను స్టార్టప్‌లకు అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వీటిల్లో చిరేట్‌ వెంచర్స్, ఇండియా క్వొటెంట్, బ్లూమ్‌ వెంచర్స్, ఇవీ క్యాప్, వాటర్‌బ్రిడ్జ్, ఓమ్నివేర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్, ఫైర్‌సైడ్‌ వెంచర్స్‌ కీలకంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు