విండ్‌ఫాల్‌ పన్ను తగ్గింపు

18 Jan, 2023 14:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుతోపాటు, ఎగుమతి చేసే డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ (గుంపగుత్త లాభాలు) పన్నును కేంద్ర సర్కారు తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత దిగిరావడంతో అందుకు అనుగుణంగా పన్నులను తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా తదితర సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.2,100గా ఉన్న విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ పన్ను రూ.1,900కు తగ్గింది. ఎగుమతి చేసే ప్రతి లీటర్‌ డీజిల్‌పై రూ.6.5గా ఉన్న పన్ను రూ.5కు తగ్గింది.

ఏటీఎఫ్‌ లీటర్‌పై రూ. 4.5 నుంచి రూ.3.5కు తగ్గింది. కొత్త పన్ను రేట్లు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది చమురు ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీనివల్ల దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చిపడ్డాయి. ఇలా గుంపగుత్తగా వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వం తీసుకునేందుకు విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ పన్నును 2022 జూలై నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి జనవరి 3నాటి సమీక్షలో విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ పన్నును కేంద్రం పెంచింది. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ మేరకు తాజాగా ఉపశమనం కల్పించింది. 

అంతర్జాతీయ పరిణామాలు..  
అంతర్జాతీయంగా చాలా దేశాలు విండ్‌ఫాల్‌ లాభా ల పన్నును అమల్లోకి తీసుకురావడం గమనార్హం. ఆరంభంలో కేంద్ర సర్కారు లీటర్‌ పెట్రోల్, ఏటీఎఫ్‌ ఎగుమతిపై రూ.6 చొప్పు,. లీటర్‌ డీజిల్‌ ఎగుమతిపై రూ.13 చొప్పున పన్ను విధించింది. దేశీయ ంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ. 23,250 పన్నును అమలు చేసింది. తదుపరి మొద టి సమీక్షలోనే పెట్రోల్‌పై ఈ పన్నును ఎత్తివేసింది.    

మరిన్ని వార్తలు