ఎయిరిండియాకు ఐటీ సపోర్ట్‌

13 Sep, 2021 00:27 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానయాన పీఎస్‌యూ.. ఎయిరిండియా ఆస్తులను ప్రత్యేక ప్రయోజన కంపెనీ(ఎస్‌పీవీ)కి బదిలీ చేయడంలో ఎలాంటి పన్ను విధింపులూ ఉండబోవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీటీడీ) తాజాగా వెల్లడించింది. ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్‌పీవీకి ఆస్తుల బదలాయింపు చేపట్టిన సందర్భంలో మూలంవద్దే పన్ను విధింపు(టీడీఎస్‌) నుంచి ప్రభుత్వం మినహాయింపునిచి్చంది. తద్వారా ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్‌కు మరింత మద్దతునిస్తోంది. కంపెనీ విక్రయ ప్రక్రియకంటే ముందుగానే ప్రభుత్వం 2019లో ఎస్‌పీవీ ఏర్పాటుకు తెరతీసింది.

దీనిలో భాగంగా ఎయిరిండియా రుణాలు, కీలకంకాని ఆస్తులను ఎస్‌పీవీకి బదిలీ చేసేందుకు నిర్ణయించింది. ఎస్‌పీవీకి స్థిరాస్తుల బదిలీ కారణంగా ఎయిరిండియాకు చేపట్టే చెల్లింపుల విషయంలోనూ టీడీఎస్‌ కోత ఉండబోదని సీబీడీటీ పేర్కొంది. ఆస్తుల బదిలీ అంశంలో ఎయిరిండియాను విక్రేతగా పరిగణించలేమని తెలియజేసింది. ప్రభుత్వం ఎయిరిండియాతోపాటు అనుబంధ సంస్థ ఏఐ ఎక్స్‌ప్రెస్‌లోగల 100 శాతం వాటాలను విక్రయించే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఎయిరిండియా శాట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సరీ్వసెస్‌లోనూ 50 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు అనుగుణంగా కొనుగోలుదారులు ఈ నెల 15కల్లా ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు