నావిక్-జీపిఎస్ చిప్‌ల తయారీకి బిడ్లు

30 Nov, 2020 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా 10 లక్షల ఇంటిగ్రేటెడ్ నావిక్, జీపిఎస్ రిసీవర్ల డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. స్వదేశీ పొజిషనింగ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి నావిక్ యూజర్ రిసీవర్లను వాణిజ్యపరం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. భారత ప్రాంతీయ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(నావిక్‌), జీపీఎస్‌ రిసీవర్లకు ఇవి వాడతారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంని నావిక్ అని పిలుస్తారు. నావిక్‌ను భారతదేశంలోని వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం సమాచార సేవలను అందించడానికి, భారత్‌తో పాటు సరిహద్దుల్లోని 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా నావిగేషన్‌ సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించారు. నావిక్ వ్యవస్థ పూర్తిగా భారత నియంత్రణలో ఉంది. జీపీఎస్‌ ఒక్కదానికే పనిచేసే చిప్‌ల బదులు నావిక్‌ను కూడా అనుసంధానం చేస్తే, పట్టణాల్లో మరింత కచ్చితంగా నావిగేషన్‌ సేవలు అందంచే వీలుంటుంది. బిడ్లు సమర్పించేందుకు జనవరి 11ను గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన బిడ్డర్లకు ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తుంది. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!)

మరిన్ని వార్తలు