ఎంఎస్‌ఎంఈ పోటీ పథకం పునరుద్ధరణ

11 Mar, 2023 04:08 IST|Sakshi

న్యూఢిల్లీ: పునరుద్ధరించిన ఎంఎస్‌ఎంఈ కాంపిటీటివ్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నూతన పథకంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం వ్యయాలను భరించనుంది. పాత పథకంలో కేంద్రం వాటా 80 శాతంగా ఉండడం గమనార్హం. ప్రతీ క్లస్టర్‌కు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాల్సిన నిబంధనను కూడా తొలగించింది. గతంలో 18 నెలల్లోగా అమలు చేయాలనే నిబందన ఉండేది.

పునరుద్ధరించిన పథకంలో దశలు వారీగా పేర్కొంది. బేసిక్‌ రెండు నెలలు, ఇంటర్‌మీడియట్‌ ఆరు నెలలు, అడ్వాన్స్‌డ్‌ పన్నెండు నెలలుగా నిర్ణయించింది. అంటే ఈ వ్యవధిలోపు ప్రాజెక్టులను దశలవారీగా ఎంఎస్‌ఎంఈలు అమ లు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో తయారీ రంగానికి ఈ పథకం అమలు చేస్తామని, రెండో దశలో సేవల రంగానికి అమల్లోకి వస్తుందని ఎంఎస్‌ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు