పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. ఇక వారి కష్టాలు తీరినట్టే!

29 Nov, 2021 22:13 IST|Sakshi

పెన్షన్లరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆయా పెన్షన్లను పొందుతున్న వారు కచ్చితంగా లైఫ్‌ సర్టిఫికెట్లను కచ్చితంగా సబ్మిట్‌ చేయాల్సి ఉండేది. వీటిస్థానంలో కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ పెన్షన్ దారుల కోసం యూనిక్ ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీని ప్రారంభించారు. దీంతో పెన్షనర్లకు ఊరట కల్గనుంది. లైఫ్‌ సర్టిఫికేట్ల విషయంలో పెన్షన్‌దారులు ఇ‍బ్బందులను ఎదుర్కొవడంతో పలు ఫిర్యాదులను చేశారు. ఫిర్యాదుల మేరకు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఇప్పటికే డిజిటల్‌గా లైఫ్‌ సర్టిఫికేట్‌లను జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది.

పెన్షన్‌ దారుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రత్యేకమైన ఫేస్ రికగ్నైషన్ టెక్నాలజీ పెన్షనర్లకు మరింత సులభతం అవుతుందని అభిప్రాయపడ్డారు.  ఈ టెక్నాలజీతో 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో,  రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోందని అన్నారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు యూఐడీఎఐకి సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 
చదవండి: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు భారీ పెనాల్టీ..! ఎందుకంటే..

మరిన్ని వార్తలు